Friday, 28 January 2022

పబ్‌లో హీరోయిన్‌తో ఆర్జీవీ! ఆ వీడియోలతో మరోసారి చర్చల్లో నిలిచిన కాంట్రవర్సీ కింగ్

అనుకున్నది చేస్తా.. అనిపించింది మాట్లాడతా అనే నైజం రామ్ గోపాల్ వర్మది అని ఇప్పటికే పలుసార్లు ప్రూవ్ అయింది. అందుకే ప్రతి క్షణం ఆయన పేరు జనం నోళ్ళలో నానుతూ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలతో మెదిలే తీరు నిత్యం చర్చల్లో నిలుస్తుంది. లేడీ యాంకర్‌తో ఇంటర్వ్యూ అంటే వర్మ ఎలాంటి బోల్డ్ కామెంట్స్ చేస్తారా? అని పనికట్టుకు చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా అరియానా, అషు రెడ్డి ఇంటర్వ్యూలు ఎంతలా వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు. ఇక వర్మ లోని మరో కోణం హీరోయిన్లతో కలిసి చిందులేస్తూ ఎంజాయ్ చేయడం. గతంలో చాలాసార్లు ఇలాంటి వీడియోలు బయటకొచ్చి హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా మరోసారి అదే జరిగింది. పబ్‌లో అమ్మాయిలతో చిందులేస్తున్న వీడియోని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచారు . ఈ వీడియోలో హీరోయిన్ ఇనయా సుల్తానాతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆర్జీవీ. ఇద్దరూ సిగరెట్ తాగుతూ సన్నిహితంగా కనిపించడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఒక చేతిలో మందు బాటిల్ పట్టుకున్న వర్మ.. మరో చేతితో అమ్మాయిని ఘాడంగా హత్తుకుని ముద్దు పెట్టుకోవడం కనిపిస్తోంది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అనుభవించు రాజా, బతికితే నీలానే బతకాలి బాసూ అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఏంటి వర్మ మాకీ ఖర్మ అంటూ ఆర్జీవీపై ఇంకొందరు విరుచుకుపడుతున్నారు. అయితే జీవితాన్ని అనుభవించడం కూడా ఒక కళే అన్నట్లుగా ఇలాంటి వీడియోలు పబ్లిక్‌గా వదులుతుండటం వర్మ వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. గతంలో కూడా ఇలాంటి వీడియోలతో వర్మపై ట్రోల్ జరగగా.. ఇద్దరు వ్యక్తులు పార్టీ ఎంజాయ్ చేస్తుంటే మూడో వాడికి ఏం సంబంధం? ఆ ఇద్దరికీ లేని ఇబ్బంది ఈ మూడో వాడికి ఏంటి? అంటూ చురకలంటించారు వర్మ. తాను అమ్మాయి అందాన్ని విపరీతంగా ఆరాధిస్తానని ఓపెన్ అయ్యారు. తాను స్వేచ్ఛగా ఉంటానని, లీగల్‌గా ఎలాంటి తప్పు చేయను. అలాగని సమాజం ఏదో అనుకుంటుందని తాను అస్సలు పట్టించుకోనని వర్మ చెప్పారు. అదే బాటలో వెళ్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతైనా వర్మ రూటే సపరేటు లెండి!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3HaiEi8

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....