Tuesday, 1 February 2022

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్: రాధే శ్యామ్ రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్

కరోనా కారణంగా వాయిదాపడ్డ పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా లైన్ లోకి వచ్చేస్తున్నాయి. వరుసపెట్టి పెద్ద సినిమాల రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్స్ చూస్తున్నాం. ఇప్పటికే ''భీమ్లా నాయక్, RRR, ఆచార్య'' రిలీజ్ డేట్స్ అధికారికంగా ప్రకటించగా తాజాగా '' రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా వాయిదాపడ్డ ఈ సినిమాను మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కోసం గత కొన్ని నెలలుగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పీరియాడిక్ ల‌వ్ స్టోరీలో వెండితెరపై ప్రభాస్- పూజా జోడీని చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సంక్రాంతి కానుకగా గ్రాండ్‌‌గా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్.. మరోసారి కరోనా విజృభించడంతో వెనక్కి తగ్గారు. దీంతో రాధే శ్యామ్ రిలీజ్‌పై బోలెడన్ని రూమర్స్ బయటకొచ్చాయి. ఈ సినిమాకు ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చిందని, అతిత్వరలో 'రాధే శ్యామ్' ఓటీటీలో రిలీజ్‌ కాబోతుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇట్టి వార్తలను ఖండిస్తూ ఈ సినిమా థియేట‌ర్స్‌లోనే విడుద‌ల‌వుతుందంటూ క్లారిటీ ఇచ్చేసిన డైరెక్ట‌ర్ రాధా కృష్ణ‌కుమార్, తాజాగా రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేస్తూ ప్రభాస్ అభిమానులను హూషారెత్తించారు. సినిమాలోని ముఖ్యాంశాన్ని విజువ‌లైజ్ చేస్తూ సిద్ధం చేసిన ఓ థీమ్ పోస్ట‌ర్ ద్వారా రాధేశ్యామ్ మార్చి 11న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల అవుతున్న‌ట్లుగా తెలిపారు. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద నిర్మాతలుగా వ్యవహరించగా.. రాధ కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. విక్ర‌మాదిత్య అనే హ‌స్త సాముద్రికా నిపుణుడిగా విలక్షణ పాత్రలో కనిపించనున్నారు ప్ర‌భాస్. ఇకపోతే ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేయడం విశేషం. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందించారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/fwFDaxOzR

No comments:

Post a Comment

'Acting Is Such A Rich Man's Business Now'

'It's no more just art and skills, it's a business.' from rediff Top Interviews https://ift.tt/rQNK1fd