పాన్ ఇండియా స్టార్ కథానాయకుడిగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్’. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో శ్రుతి హాసన్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. ఇందులో సెకండ్ హీరోయిన్‌ను కూడా చిత్ర యూనిట్ ఎంపిక చేసుకుందని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం మేరకు, మీనాక్షీ చౌదరి సలార్‌లో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇప్పుడు క్రమంగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలను దక్కించుకుంటుంది. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ సరసన ‘ఖిలాడి’లో మీనాక్షి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే ప్రభాస్ సినిమాలో అవకాశం దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది. ఇది నిజంగా ఆమెకు మంచి అవకాశమేనని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఎలాంటి గుర్తింపు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కె.జి.యఫ్ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సలార్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. కానీ అదే రోజున కె.జి.యఫ్ ఛాప్టర్ 2 సినిమా విడుదలవుతుంది. ఆ లెక్కలో చూస్తే సలార్ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ తనదైన స్టైల్లో ఈ సినిమాను యాక్షన్ మూవీగా ఆవిష్కరిస్తున్నారు. సాధారణంగా ఈయన సినిమాల్లో హీరోయిన్స్‌కు పెద్దగా ఆస్కారం ఉండదు. శ్రుతిహాసన్ పాత్రకే ఎలాంటి ప్రాధాన్యం ఉండకపోవచ్చునని సినీ విశ్లేషకుల వాదన. మరిప్పుడు మీనాక్షీ చౌదరి పాత్రకు ఎలాంటి ప్రాధాన్యముంటుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Yk1E7S
No comments:
Post a Comment