పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కు రీమేక్. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఏంటంటే.. ఇందులో ఇద్దరు హీరోయిన్స్‌కు స్థానం ఉంది. పవన్ కళ్యాన్ జోడీగా సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు రానా దగ్గుబాటి సరసన మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ నటించనున్నారు. సంయుక్తా మీనన్ నటించనున్న తొలి తెలుగు చిత్రమిదే. ఇప్పటి వరకు ఆమె మలయాళం, తమిళ చిత్రాల్లోనే నటించారు. ‘భీమ్లా నాయక్’లో ఆమె నటించబోతున్న విషయాన్ని ఆమెనే అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ చిత్రంలో ఆయనతో కలిసి నటించనుండటం చాలా సంతోషంగా ఉంది. లీడర్, పవర్‌స్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుండటం అదృష్టంగా భావిస్తున్నాను. రానా దగ్గుబాటిగారికి జోడీగా కనిపించబోతున్నాను. ఇంత కంటే తెలుగులో బ్యూటీఫుల్ ఎంట్రీ ఉండబోదని అనుకుంటున్నాను’’ అని తెలిపారు సంయుక్తా మీనన్. నిజానికి ముందుగా దర్శక నిర్మాతలు ఐశ్వర్యా రాజేశ్‌ను రానా జోడీగా నటింప చేయాలని అనుకున్నారు. అయితే ఎందుకనో ఐశ్వర్యా రాజేశ్ ఈ ప్రాజెక్ట్‌లోకి రాలేదు. ఆమె స్థానంలో సంయుక్తను తీసుకున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ.. ఇప్పుడు రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని సమాచారం.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WG38Zq
No comments:
Post a Comment