ఈ సారి 'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మధ్య పోటీ మరింత రసవత్తరంగా మారింది. అధ్యక్ష బరిలో ఉన్న ఇద్దరు ఇప్పటికే తమ తమ ప్యానల్స్ ప్రకటించి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇప్పుడు ఎవరికి వారు ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. నటీనటుల విమర్శలు, ప్రతి విమర్శలతో వాడీవేడీగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో తనకే మద్దతు ఇస్తున్నారని ప్రకటించారు మంచు విష్ణు. ఈ మేరకు ఆదివారం ఉదయం ‘అఖండ’ సెట్‌కు వెళ్లిన విష్ణు కాసేపు బాలయ్యతో ముచ్చటించారు. తన మేనిఫెస్టో గురించి వివరించి ఆయన మద్దతు తీసుకున్నారు. ‘మా’ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం తాను చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించారు. మంచు విష్ణు అభిప్రాయాలతో ఏకీభవించిన బాలయ్య తనకు మద్దతు ప్రకటించారని విష్ణు తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపిన బాలయ్య బాబు.. ''బాలా అన్న.. మీ సపోర్ట్‌కు ధన్యవాదాలు. మీరు నాకు మద్దతు తెలపడం ఎంతో గర్వంగా ఉంది'' అని విష్ణు పోస్టు పెట్టారు. ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mkM2Jh
No comments:
Post a Comment