టాలీవుడ్ బుట్టబొమ్మ సోషల్ మీడియాలో చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఇలాంటి టాప్ సెలెబ్రిటీలు సండే వస్తే ఎలాంటిచోట్లకు వెళ్తారో అందరికీ తెలిసిందే. పార్టీలు, పబ్‌లు తాగి తందనాలు ఆడుతుంటారు. కానీ పూజా హెగ్డే మాత్రం దైవభక్తిలో మునిగిపోయింది. కాశీ విశ్వనాథుని సన్నిధికి చేరింది. గంగాతీరంలో శివ నామస్మరణ చేసింది. గంగా హారతిలో పాల్గొని దైవచింతనలో మునిగింది. అలా ఆదివారం నాడు కాశీలో పూజా హెగ్డే సందడి చేసింది. గంగానది తీరంలో పూజా హెగ్డే సోదరుడితో కలిసి అక్కడి ప్రాంతాలను చుట్టేసింది. అలా పూజా హెగ్డే లైఫ్ ఆఫ్ పై సినిమాపై కౌంటర్ వేసింది. లైఫ్ ఆఫ్ పూ ఇలానే ఉంటుందని గంగానదిలో షికార్లు కొడుతున్న ఫోటోలను షేర్ చేసింది. ఇక అందులో పైపాత్రలో తాను ఉన్నట్టు.. రిచర్డ్ పార్కర్‌గా రిషబ్ హెగ్డే ఉన్నట్టు చెప్పుకొచ్చింది. మొత్తానికి సోదరుడైన రిషబ్‌తో కలిసి పూజా హెగ్డే కాశీ విశేషాలను చూసేసింది. అక్కడి సూర్యోదరం, ఇంద్రధనస్సును చూసి బుట్టబొమ్మ మురిసిపోయింది. మొత్తానికి ఆదివారం నాడు దైవదర్శనంలో పూజా హెగ్డే బిజీగా గడిపింది. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వస్తోంది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అనే చిత్రం గత కొన్ని రోజులుగా వాయిదాలు పడుతూనే వస్తోంది. చిట్టచివరకు అక్టోబర్ 15న ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఇక అవి కాకుండా ఆచార్య, రాధే శ్యామ్ సినిమాలతో పూజా హెగ్డే తన మ్యాజిక్‌ను చూపించేందుకు రెడీ అవుతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3uPOv2p
No comments:
Post a Comment