తొలి సినిమా 'ఉప్పెన'తో బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్న మెగా మేనల్లుడు తన రెండో సినిమాగా '' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదల కానున్న నేపథ్యంలో శనివారం రాత్రి ఆడియో లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎం కీరవాణి, రాజీవ్ రెడ్డి, క్రిష్, వైష్ణవ్ తేజ్, సాయి చంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిపై ప్రశంసల వర్షం కురిపించారు. RRR లాంటి బిగ్ సినిమాలకు మ్యూజిక్ అందించడంలో ఎంతో బిజీగా ఉన్నా కూడా తమ సినిమా కోసం అద్భుతమైన సంగీతాన్ని అందించారని చెబుతూ, ఈ రోజు ఆయనే హీరో అని అన్నారు వైష్ణవ్ తేజ్. నేను చేసిన సినిమా ఒకెత్తు అయితే.. కీరవాణి గారి సంగీతం మరో ఎత్తు అని చెప్పారు. ''సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవలను తెరపైకి తీసుకుని వచ్చేందుకు క్రిష్ చాలా కష్టపడ్డారు. జీవితంలో ఎంత కింద పడినా సరే ఎప్పుడూ తలెత్తుకుని ఉండాలని, దేశం గర్వపడేలా చేయాలని క్రిష్ చాలా మోటివేట్ చేసేవారు. తలెత్తుకుని ఉంటూ దేశం గర్వపడేలా చేయాలనుకునే ఓ కుర్రాడి కథనే ఈ కొండపొలం'' అని వైష్ణవ్ తేజ్ అన్నారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ''నల్లమల అడవుల్లో నలభై రోజులు ఉండి, అక్కడి సంఘటనలతో ‘కొండపొలం’ నవల రాశాను. రాయలసీమ కథ సినిమాగా రావడం మనకెంతో గర్వకారణం. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కథ అని ఆలోచిస్తారు. ఒకటి రెండు శాతమే ఉండే ఫ్యాక్షన్‌ను తీసేసి 98 శాతం ఉండే రైతులు, గొర్రెల కాపర్లు, అట్టడుగువర్గాల వారి కష్టాల గురించి చెప్పే కథ ఈ కొండపొలం'' అని అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39ZSxvd
No comments:
Post a Comment