సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. మహిళల సమస్యల కోసం ఎప్పుడూ పాటుపడుతూనే ఉంటుంది. అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలపై స్పందిస్తూ ఉంటుంది. కొందరు తల్లిదండ్రులు వారి కూతుళ్లను ఎన్ని కష్టాలకు గురి చేస్తున్నారో చెబుతూ ఉంటుంది. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసి జీవితాలను ఎలా నాశనం చేశారో చెబుతూ ఉంటుంది. ఎంతో మంది అమ్మాయిలు, మహిళల తమ బాధలను చిన్మయితో పంచుకుంటారు. ఇచ్చే సలహాలతో కొంత మంది వారి సమస్యలకు పరిష్కారాలను వెతుక్కుంటారు. అయితే తాజాగా చిన్మయి మహిళలపై జరిగే అత్యాచారలు, వాటిపై కొందరు మగవారు స్పందించే తీరుపై మండిపడింది. ‘అమ్మాయిలు ఇలా ఉండాలి.. అలా ఉండాలి.. ఇలా అడ్జస్ట్ చేయాలి.. కెరీర్ వద్దు.. టైట్స్ వద్దు.. రేప్ జరిగితే అమ్మాయి అలాంటి డ్రెస్ వేసుకుంది.. టిక్ టిక్‌లో వీడియోలు చేసేది మన కల్చర్ కాదు. చున్నీలు వేసుకోకపోతే అమ్మాయిల మీద అటాక్స్ జరుగుతాయి ముఖ్యంగా మగ పిల్లలకు బ్రీస్ట్ ఫీడ్ చేయకపోతే అబ్బాయిలు రేప్ చేస్తారు అన్నటువంటి ఒపినీయన్ మగవాళ్లు అంటేను.. ఆడవాళ్లు అంటేను. నాన్ సెన్స్ ఎక్కడైనా నాన్ సెన్సే. ఇలాంటి మనుషులకు అటెన్షన్ కావాలి. ఇలాంటి ఐడియాలకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఇలాంటి మనుసులు సమాజానికి దూరంగా ఉంటారు. ఆడవాళ్లు చంద్రమండలంలోకి కూడా వెళ్తున్నారు. ఒక అమ్మాయి అస్ట్రోనాట్ అయి మార్స్‌కి వెళ్తే ఇంట్లో చపాతి చేయలేదా? సూట్ మీద చున్నీ వేసుకున్నావా అన్నటువంటి ఆంటీ అంకుల్స్‌తో మనకేంటి పని. అలాంటి వారిని పట్టించుకోకండి. నీ కలల వెంటనడవండి. మీరేం కావాలని అనుకుంటున్నారో అదే చేయండి. మనం ఏం చేస్తామో దాన్నుంచే సోసైటీ మనల్ని చూస్తుంది. రేప్ జరిగితే.. అమ్మాయిది తప్పంటారని గుర్తుపెట్టుకోండి. కట్నాలు తీసుకుంటారు. క్యాస్ట్ మర్డర్‌లు చేస్తారు. గర్భంలోనే అమ్మాయిలని చంపేస్తారు. ఇటువంటి నలుగురు ఉన్న చెత్త సొసైటీ ఏం అంటే ఏంటి? రేపు మీరు సక్సెస్ అయితే తోక ఊపుకుని మీ వెనకాల వస్తారు.. అప్పుడే తెలుసు నువ్ చాలా సక్సెస్ అవుతావు అని హిహిహి అంటూ. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెబుతున్నా. మీ పని మీరు చేసుకోండి. మీ కలలకు తగ్గట్టుగా పని చేసుకోండి. సమాజంలో విషపు మనుషులతో జాగ్రత్తగా ఉండండి.. భవిష్యత్తును మనం మార్చేయాల్సిన అవసరం ఉంది’ అంటూ చిన్మయి చెప్పుకొచ్చింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3l6xI7Z
No comments:
Post a Comment