తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ (64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సినిమాలతో పాటు టీవీ రంగంలో కూడా రాజబాబు రాణించారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని నరసాపురపేట. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు. దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు 1995లో 'ఊరికి మొనగాడు' అనే సినిమాలో అవకాశం ఇవ్వడంతో రాజబాబు తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ''సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారి, భరత్ అనే నేను'' లాంటి సూపర్ హిట్ సినిమాల్లో రాజబాబు నటించారు. మొత్తం 62 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన రాజబాబు బుల్లితెరపై ''వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి.ల.సౌ. స్రవంతి'' లాంటి సీరియల్స్‌తో అలరించారు. 2005 సంవత్సరంలో 'అమ్మ' సీరియల్‌లో చేసిన పాత్రకు గాను ఆయనను నంది అవార్డు వరించింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Zi9nUB
No comments:
Post a Comment