Tuesday 5 October 2021

ప్రముఖ నటుడు, ‘రామాయణ్‌’ ఫేమ్ అరవింద్ త్రివేది కన్నుమూత

ప్రముఖ నటుడు, దూరదర్శన్‌లో ప్రసారమైన ‘రామాయణ’ ఫేమ్ అరవింద్‌ త్రివేది ఇకలేరు. ముంబైలోని తన నివాసంలో గత రాత్రి ఆయన గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 82 సంవత్సరాలు. మరణవార్తను ఆయన సహ నటుడు సుశీల్ లహిరి ఈ తెల్లవారుజామున ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. అరవింద్‌ మరణ వార్త తెలిసి బాలీవుడ్‌ టీవీ, సినీ నటీనటుల సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. అప్పట్లో వచ్చిన ‘రామాయణ’ సీరియల్‌లో రావణుడి పాత్ర పోషించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థానం సంపాదించారు అరవింద్ త్రివేది. అరవింద్ త్రివేది అంత్యక్రియలు బుధవారం ముంబైలోని కాండివాలి వెస్ట్‌లో ఉన్న శ్మశానవాటికలో జరగనున్నాయి. 1980 దశకంలో ఈ ‘రామాయణ్‌’ సీరియల్‌ ప్రేక్షకులను అలరించడమే గాక.. టీవీకి దగ్గర చేసింది. ముఖ్యంగా ఇందులో అరవింద్ త్రివేది పోషించిన రావణుడి పాత్ర అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ సీరియల్‌లో రావణుడిగా అరవింద్‌ త్రివేది నటించగా రాముడిగా అరుణ్ గోవిల్, లక్ష్మణుడిగా సునీల్‌ లాహిర్‌, సీతగా దీపిక చిఖిలియా నటించారు. ఫస్ట్‌ లాక్‌డౌన్‌ సమయంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు దూరదర్శన్‌ ‘రామాయణ్‌’ను పున:ప్రసారం చేసి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు పలు టీవీ సీరియళ్లలో నటించి తన నటనతో గుజరాతీ ప్రేక్షకులను మెప్పించిన అరవింద్.. రాజీకీయాల్లోనూ చక్రం తిప్పారు. 1991 నుంచి 1996 వరకు సబర్కథ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పని చేశారు అరవింద్ త్రివేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mq8Bwd

No comments:

Post a Comment

'Markets Not In Panic Yet, But...'

'If you see another 1000-point correction, people may start panicking.' from rediff Top Interviews https://ift.tt/RjF0mDo