Saturday 2 October 2021

‘వడ్డాణం’ చుట్టి భామలు వస్తున్నారట.. ‘వరుడు కావలెను’ నుంచి పాట అదిరిపోయింది..

విభిన్నమైన సినిమాలు చేయడంలో యంగ్ హీరో ఎప్పుడూ ముందుంటారు. ఒక సినిమాకు, మరో సినిమాకు కచ్చితమైన భిన్నత్వాన్ని ఆయన చూపిస్తూ ఉంటారు. అలా వినోదం మాత్రమే కాదు.. మంచి సందేశం ఉన్న సినిమాలు చేస్తుంటారు నాగశౌర్య. ప్రస్తుతం ఆయన నటించిన ‘లక్ష్య’, ‘’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ దసరా కానుకగా ‘వరుడు కావలెను’ అనే సినిమాను దసరా కానుకగా విడుదల అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, ఆ తర్వాత విడుదల అయినా.. ట్రైలర్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ‘దిగు దిగు దిగు నాగ’ అంటూ సాగే పాట ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘వడ్డాణం’ పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు.. వయ్యారం చిందేసే అందాల బొమ్మలు.. పరికిణిలో పడుచును చూస్తే పందిరంతా జాతరే.. అయ్యో రామా క్యా కరే..’ అంటూ సాగే ఈ పాట అభిమానులను విశేషంగా ఆలరిస్తోంది. అయితే ఈ పాటలో మరో విశేషం కూడా ఉంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 12 మంది గాయనీ గాయకులు కలిసి ఈ పాటను పాడారు. గీతా మాధురి, ఏఎల్ గాయత్రి, అదితి భావరాజు, శృతి రంజని ఈ పాట పాడారు. వీరితో పాటుగా శ్రీకృష్ణ, సత్య యామిని, సాహితీ, మనీషా, శ్రీనిధి, రవళి, అభిఖ్య ఈ పాటలను ఆలపించారు. ఇక థమన్ అందించిన సంగీతంకి, నాగశౌర్య, వేయాల్సిన స్టెప్పులు బృందా మాస్టర్ కొరియోగ్రాఫీ చేశారు. ఇక ఈ సినిమాలో నదిమా, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ హర్షవర్ధన్, హిమజ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీన విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YiDRFo

No comments:

Post a Comment

'Cancelling Adani Project Not Good Sign'

'If there is a push towards a Marxist oriented government it will be dangerous.' from rediff Top Interviews https://ift.tt/Iy8vqEL