Saturday, 2 October 2021

ఇప్పటివరకూ చేసిన సినిమాల కంటే ఇది భిన్నమైంది.. రాధేశ్యామ్‌పై పూజా కామెంట్స్

‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల్లో కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘రాధేశ్యామ్’ ఒకటి. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చిన చాలాకాలమే అయింది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా విడుదలకు పలు మార్లు కరోనా కారణంగా ఆటంకాలు ఏర్పడ్డాయి. కానీ, వాటన్నిటిని దాటుకొని.. చివరికి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. పీరియాడిక్ లప్‌సోర్టీగా ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు రాధాకృష్ణ. 1980 ప్రాంతాల్లో ఇటలీలో జరిగిన ఓ ప్రేమ కథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతే కాకుండా ఇదే ఫాంటసీ కథ అనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే సినిమా గురించి ప్రేక్షకులకు తెలిసింది ఇంతే. అసలు సినిమా కథ ఏంటి అనే విషయంలో ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఒక్కోక్కరు ఒక్కో విధంగా కథని అల్లేసుకుంటన్నారు. ఇప్పటివరకూ ఈ సినిమా గురించి ఎన్నో రూమర్లు కూడా పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ సినిమా గురించి హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది. ‘నేను గతంలో చాలా లవ్‌స్టోరిలు చేశాను. కానీ, ఈ సినిమా అన్నికన్న ప్రత్యేకమైన సినిమా. ఒక అద్భుమైతన ప్రేమకథను ఈ సినిమాలో మీరు చూస్తారు. ప్రేక్షకులు కచ్చితంగా ఆస్వాదిస్తారనే నమ్మకం నాకు ఉంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది’ అని పూజా తెలిపింది. ఇక ఈ సినిమాను యు.వి.కృష్ణంరాజు సమర్పణలో రాబోతున్న ఈ సినిమాను వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛేత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3D1PE9K

No comments:

Post a Comment

'Our India centre is a hub for global innovation'

'Our business continues to roll out its strategy, the role of this GDTC continues to grow.' from rediff Top Interviews https://ift...