‘మా’ ఎన్నికల బరి నుంచి నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తప్పుకున్నారు. ‘‘నా దైవ సమానులు.. నా ఆత్మీయులు.. నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను 'మా' జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను’’ అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు బండ్ల. రీసెంట్‌గా ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో ఇద్దరు గొప్ప వ్యక్తులు పోరాడుతున్నారు. అలాంటి వారితో పోటీ పడి గెలిచి, హామీలు నేరవేర్చలేకపోతే తప్పు చేసిన వాడినవుతా. అందుకనే మా ఎన్నికల నుంచి తప్పుకున్నాను. అలాగే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులలో ఎవరు గెలిచినా వారు ఇచ్చిన హామీలను నేరవేర్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అలాగే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ గెలిస్తే వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పించేలా ఆయన్ని ఒప్పిస్తాను’’ అన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేశ్ మాట్లాడుతూ ‘‘పవన్ కళ్యాణ్‌గారు ఇండస్ట్రీకి రథసారథిలాంటివారు. ఎంతో మందిని చిత్ర సీమకు పరిచయం చేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. ఎవరికి సమస్య ఉన్నా స్పందిస్తారు. నా సినిమాలను ఆపేయండి కానీ, ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టకండి అనే పవన్ ఆరోజు మీటింగ్‌లో అన్నారు. దానికి ఆయన్ని ఇండస్ట్రీ నుంచి పక్కన పెట్టేస్తున్నట్లు మాట్లాడటం ఎంతో బాధగా అనిపించింది’’ అన్నారు బండ్ల గణేశ్. పవన్ కుటుంబ సభ్యులపై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ స్పందిస్తూ.. పోసాని ఎక్స్‌పైరీ అయిన టాబ్లెట్‌తో సమానం. తొలి ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు తన అభిప్రాయం చెప్పాడు అది ఓకే. ఆ మరుసటి రోజున పవన్ కళ్యాణ్ తల్లి గురించి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడం చాలా తప్పు. దేవుడు అనేవాడు ఉంటే, ఆయనకు భయంకరమైన చావు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి తల్లి వల్ల పరోక్షంగా ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. గురించి మాట్లాడి నా స్థాయి తగ్గించుకోలేను’’ అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3F5Pkc5
No comments:
Post a Comment