Monday, 20 December 2021

అల్లు అర్జున్ ఫైర్ పుట్టించాడన్న Samantha.. వైరల్ అవుతున్న పోస్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ‘పుష్ప ది రైజ్‌’. శేషాచ‌ల అడవుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కింది. డిసెంబ‌ర్ 17న విడుద‌లైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ వ‌సూళ్ల ప‌రంగా ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌లేదు. బ‌న్నీ కెరీర్‌లో క‌లెక్ష‌న్స్ ప‌రంగా ది బెస్ట్ అనిపించుకుంటూ దూసుకెళుతోంది. బ‌న్నీ డైలాగ్ డెలివ‌రీ, యాక్టింగ్‌, సుకుమార్ టేకింగ్, ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌, ఆర్ట్ వ‌ర్క్ ఇలా సినిమా గురించి అంద‌రూ మాట్లాడుకుంటున్నారు. వీటన్నింటీతో పాటు అంద‌రూ మాట్లాడుకుంటున్న మ‌రో ఎలిమెంట్ సినిమాలోని ఐటెం సాంగ్ గురించి. సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్స్ కామ‌న్‌గా ఉంటాయి క‌దా, అందులో కొత్తేమీ అనుకోకండి. ఇప్ప‌టి వ‌ర‌కు స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించ‌ని స్టార్ హీరోయిన్ స‌మంత ఐటెమ్ భామ‌గా క‌నిపించారు. పుష్ప ది రైజ్‌లో స‌మంత చేస్తార‌న‌గానే పాట ఎలా ఉండ‌బోతుందోన‌ని అంద‌రిలో తెలియ‌ని క్రేజ్ వ‌చ్చింది. సినిమా విడుద‌ల త‌ర్వాత కూడా ‘ఊ అంటావా మావ ఉ ఉ అంటావా మావ‌..’ అంటూ అంద‌రూ స‌ద‌రు పాట‌ను పాడుకుంటున్నారు. ఒకానొక స‌మయంలో ఈ పాట‌ను తీసేయాల‌ని కూడా కేసులు పెట్టిన మ‌గ‌వారు లేక‌పోలేదు. పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌లైన పుష్ప ది రైజ్ మూవీకి ఎలాంటి క్రేజ్ వ‌చ్చిందో, అలాంటి క్రేజే ‘ఊ అంటావా మావ ఉ ఉ అంటావా మావ‌..’ పాట‌కు వ‌చ్చింది. ఈ పాట గురించి స‌మంత ఇన్‌స్టా వేదికగా స్పందించారు. హీరో అల్లు అర్జున్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ‘‘అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ అలా ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రతి సెకను తన నటనతో సిల్వర్ స్క్రీన్‌పై మంట పుట్టించారు. గొప్ప న‌టుడు. త‌ను స్క్రీన్‌పై ఉన్న‌ప్పుడు చూపు తిప్పుకోవ‌డం అంత సుల‌భం కాదు. ఈ సినిమా కోసం త‌ను ప్ర‌త్యేక‌మైన యాస నేర్చుకోవ‌డ‌మే కాకుండా, భుజాన్ని ఓ వైపు వంచి చేసిన పెర్ఫామెన్స్ నిజంగా అద్భుతం. త‌న న‌ట‌న చూసి ఎంతో ఇన్‌స్పైర్ అయ్యాను’’ అన్నారు. అంతే కాకుండా తను పుష్ప ది రైజ్ సినిమాలో చేసిన ‘ఊ అంటావా మావ ఉ ఉ అంటావా మావ‌..’ సాంగ్ గురించి మాట్లాడుతూ మంచి సినిమాలు, ఆకట్టుకోని సినిమాలు చేశాను. ఏ సినిమా చేసినా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవాల‌ని ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశాను. అయితే సెక్సీగా క‌నిపించ‌డం అనేది హార్డ్ వ‌ర్క్‌లో మ‌రో లెవ‌ల్‌’’ అని తెలియ‌జేసింది చెన్నై బ్యూటీ స‌మంత‌. Also Read :


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eckK4a

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....