Saturday 18 December 2021

NBK 107కి ఇట్రెస్టింగ్ టైటిల్... డైరెక్టర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుద్దా!

నంద‌మూరి అంద‌గాడు బాల‌కృష్ణ లేటెస్ట్ మూవీ ‘అఖండ‌’తో భారీ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత అత్యంత భారీ హిట్ అయిన సినిమా ఇది. వంద కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించి బాల‌కృష్ణ కెరీర్‌లోనే టాప్ మోస్ట్ మూవీగా నిలిచింది. బాల‌య్య త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్ణ చేస్తున్న 107వ సినిమా ఇది. మ‌రో వైపు ‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన గోపీచంద్ మ‌లినేని.. బాల‌కృష్ణ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు స్టోరిని డెవ‌ల‌ప్ చేశారు. లేటెస్ట్‌గా సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు గోపీచంద్ మ‌లినేని వేట పాలెం అనే టైటిల్‌ను పెట్టాల‌ని గోపీచంద్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. బాల‌య్య‌కు కూడా ఈ టైటిల్ న‌చ్చింద‌ట‌. త్వర‌లోనే టైటిల్‌ను అధికారికంగా కూడా అనౌన్స్ చేయ‌బోతున్నార‌ట‌. క్రాక్ సినిమాను గోపీచంద్ మ‌లినేని, వేట పాలెం బ్యాక్ డ్రాప్‌లోనే తెర‌కెక్కించారు. మ‌రోసారి అదే సెంటిమెంటును ఫాలో అవుతూ మ‌రోసారి అదే బ్యాక్ డ్రాప్‌లో సినిమా చేస్తున్నార‌ట‌. క‌థ‌ను అనుస‌రించే వేట పాలెం అనే టైటిల్‌ను నిర్ణ‌యించార‌ట‌. అఖండ సినిమాలో డ‌బుల్ రోల్‌తో మెప్పించిన బాల‌కృష్ణ మ‌రోసారి డ్యూయెల్ రోల్‌లో అల‌రించ‌బోతున్నార‌ట‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. కోవిడ్ సెకండ్ వేవ కార‌ణంగా అఖండ చిత్రీక‌ర‌ణ పూర్తి కావ‌డంలో ఆల‌స్య‌మ‌వ‌డంతో NBK 107 షూటింగ్ స్టార్ట్ కావ‌డానికి స‌మ‌యం ప‌ట్టింది. ఆ త‌ర్వాత కొన్ని వారాల ముందు బాల‌కృష్ణ భుజానికి ఆప‌రేష‌న్ అయ్యింది. దాంతో ఆయ‌న రెస్ట్ తీసుకుంటున్నారు. దాని కార‌ణంగా NBK 107 చిత్రం సెట్స్‌పై వెళ్ల‌డానికి మ‌రి కాస్త స‌మ‌యం తీసుకుంది. ఈ గ్యాప్‌లో బాల‌కృష్ణ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో త‌ను ప్రారంభించిన టాక్ షో అన్ స్టాప‌బుల్‌కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు ఎపిసోడ్స్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. రీసెంట్‌గా గోపీచంద్ మ‌లినేని, ర‌వితేజ‌ల‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ను కూడా పూర్తి చేశార‌ని స‌మాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Fp1fBz

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz