Monday 20 December 2021

పద్ధతిగా లేదు.. అభిమానులకు ఎన్టీఆర్ వార్నింగ్!

స్టార్ హీరోల‌కు అభిమానులే కొండంత అండ‌. వారి బ‌ల‌మే ఎక్స్‌పెరిమెంట్స్ చేయ‌డానికి ధైర్యాన్ని ఇస్తుంటుంది మ‌న క‌థానాయ‌కుల‌కు. అలాంటి అభిమాన గ‌ణం మెండుగా ఉన్న టాలీవుడ్ అగ్ర హీరోల్లో యంగ్ టైగ‌ర్ ఒక‌రు. ఆయ‌న ఎప్పుడు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ ఇత‌రుకు ఆద‌ర్శంగా నిల‌వాల‌ని అభిమానుల‌కు చెబుతుంటారు. ఈ అగ్ర క‌థానాయ‌కుడు న‌టించిన లేటెస్ట్ మూవీ RRR. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కూడా మ‌రో హీరోగా న‌టించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 7న భారీ లెవ‌ల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్‌, రామారావు క‌లిసి సినిమాను ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. రీసెంట్‌గా ముంబైలో గ్రాండ్‌గా జ‌రిగింది. బాలీవుడ్ మెగాస్టార్ స‌ల్మాన్ ఖాన్ ఈ వేడుక‌కి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ ముంద‌స్తు వేడుక కోసం తెలుగు రాష్ట్రాల‌తో పాటు క‌ర్ణాట‌క నుంచి బ‌స్సులో బ‌య‌లు దేరారు. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌, అటు రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ముంబై న‌గ‌రంలో చేసిన హడావుడి మామూలుగా లేదు. RRR Pre Release Eventను ఓ ఆడిటోరియంలో ప‌రిమిత సంఖ్య‌లోని అభిమానుల స‌మ‌క్షంలో నిర్వ‌హించారు. అయినా కూడా అక్క‌డ ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ చేశారు. కొంద‌రు అయితే ఏర్పాటు చేసిన బారికేడ్ల‌ను దాటి లోప‌లికి రావ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఇది కాస్త అక్క‌డున్న ఇత‌ర సెల‌బ్రిటీల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. ప‌రిస్థితిని అర్థం చేసుకున్న ఎన్టీఆర్ రంగంలోకి దిగి, మైక్ అందుకున్నారు. ఇది ప‌ద్ధ‌తిగా లేదు.. అంద‌రూ కింద‌కు దిగుతారా లేదా? కింద‌కు దిగండి.. రాష్ట్రం కానీ రాష్ట్రం వ‌చ్చాం. అంద‌రూ మ‌న గురించి మంచిగా మాట్లాడుకోవాలి. అంద‌రూ ప‌ద్ధ‌తిగా కింద‌కు దిగండి అని స్పీట్ వార్నింగ్ ఇస్తూనే అభ్య‌ర్థించారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. RRR సినిమా విష‌యానికి వ‌స్తే ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. 1920 నేప‌థ్యంలో న‌డిచే ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ఇది. బాహుబ‌లి వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌ల‌తో పాటు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, శ్రియా శ‌ర‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని త‌దితరులు న‌టించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pb0cPL

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz