Thursday, 23 December 2021

వస్తున్నాం.. వచ్చేస్తున్నాం! నాగ చైతన్యతో యంగ్ హీరోయిన్.. నాగార్జున పోస్ట్ అర్థం అదేనా?

సీనియర్ హీరో అక్కినేని నేటికీ అదే ఎనర్జీతో సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ మన్మథుడిగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌తో ఆకట్టుకుంటున్నారు. పంచె కట్టినా, జీన్స్ వేసినా వెండితెరపై ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఫిదా అయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. ఇదే బాటలో వెళుతున్న నాగార్జున తాజాగా తన లేటెస్ట్ మూవీ '' ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుంచే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చి అభిమానుల్లో ఉత్సాహం నింపారు నాగ్. నాలుగేళ్ల క్రితం విడుదలై సూపర్ హిట్ సాధించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వల్‌గా ఈ 'బంగార్రాజు' మూవీ రాబోతోంది. చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య జంటగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదట నిర్మాతలు. అందుకు తగ్గట్టు ఇప్పటివరకు విడుదల చేసిన 'బంగార్రాజు' అప్‌డేట్స్, సాంగ్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు గానీ షూటింగ్ కంప్లీట్ కాలేదని, సో.. ఇంకా ఆలస్యం కావొచ్చనే టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా నాగ చైతన్య- కృతి శెట్టి కలిసి మాస్ స్టెప్పేస్తున్న ఓ స్టిల్ షేర్ చేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు నాగార్జున. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని, ఇది పండగ లాంటి సినిమా.. త్వరలోనే మీ ముందుకు రాబోతుందని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ తండ్రీ కొడుకులు సంక్రాంతి బరిలో నిలువబోతున్నారా? అనే పాయింట్ చర్చల్లో నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో జీ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. రొమాన్స్, ఎమోషన్స్, అన్నిరకాల కమర్షియల్ అంశాలతో ఈ సినిమా రూపొందించారట. నాగార్జున, నాగ చైతన్యలు తాత మనవడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుండటం సినిమా పట్ల ఆసక్తి నెలకొల్పింది. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3muFrN4

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....