దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన భారీ పాన్ ఇండియా మూవీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మెగా, సహా అశేష సినీ వర్గాలు బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నాయి. నేటితరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండటంతో పాటు ఎప్పటికప్పుడు జక్కన వదిలిన RRR అప్‌డేట్స్ సినిమాపై అమితమైన ఆసక్తి నెలకొల్పాయి. రీసెంట్‌గా ఈ సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలో మెగా, నందమూరి అభిమానుల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్ అగ్రిమెంట్స్ చేసుకున్నారని తెలుస్తోంది. స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కనిపించనున్నారు. అయితే ఇద్దరూ స్టార్ హీరోలే పైగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కావడంతో RRR సినిమాలో ఈ ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ వారి వారి రోల్స్ చేయించామని ఇప్పటికే జక్కన్న క్లారిటీ ఇచ్చేశారు. దీంతో అటు మెగా, ఇటు నందమూరి శిబిరాలు ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. భారీ రేంజ్‌లో 10,000కు పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇరు వర్గాల ఫ్యాన్స్ నడుమ వార్ నడిచే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇది ముందే ఊహించిన మెగా, నందమూరి ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్ కొన్ని ఒప్పందాలు కుదుర్చుకొని సంతకాలు కూడా చేసుకున్నారట. ఎవరికీ వారు కొన్ని థియేటర్లను కేటాయించుకుని ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరో థియేటర్ దగ్గర హడావిడి చేయకుడదని నిర్ణయించుకున్నారట. అలాగే ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరో ఫ్యాన్స్ ఉన్న థియేటర్ల వద్ద బ్యానర్లు, నినాదాలు చేయకూడదని, అంతా కలిసి ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యారట. నిజానికి గతంలో చాలా మల్టీస్టారర్ సినిమాలొచ్చినా ఫ్యాన్స్ నడుమ ఇలాంటి ఒప్పందాలు ఎక్కడా చూడలేదు. చరిత్రలో తొలిసారి తొలిసారి ఇలాంటి ఒప్పందాలు చూస్తున్నాం. సో.. చూడాలి మరి ఇరువురి ఫ్యాన్స్ ఈ ఒప్పందాలపై ఎంతవరకు నిలబడి RRR విజయాన్ని ఆస్వాదిస్తారో!.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yoDF56
No comments:
Post a Comment