Saturday, 25 December 2021

ఈ ప్రపంచం చాలా కఠినమైంది పద్మ.. నువ్వే లేకుంటే! నాగబాబు ప్రేమ బాణం

టాలీవుడ్‌లో మెగా బ్రదర్ నాగబాబుది ఓ ప్రత్యేకమైన జర్నీ. వెండితెర మొదలుకొని బుల్లితెర, ఆన్ లైన్ వేదికల వరకు ఆయన హంగామా నడుస్తుంటుంది. ఓ పక్క నటుడిగా కొనసాగుతూనే మరోపక్క నిర్మాతగా సత్తా చాటుతున్నారు . ఇక మెగా ఫ్యామిలీ మెంబెర్‌గా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు వృత్తిపరమైన, కుటుంబ పరమైన విషయాలను అభిమానులతో పంచుకునే ఆయన తాజాగా ఓ ప్రేమ బాణం విసురుతూ తన భార్యపై ఉన్న అమితమైన ప్రేమను బయటపెట్టారు. తన కుటుంబమంటే ఎంతో ఇష్టపడే నాగబాబు.. కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారికపై ప్రేమ కురిపిస్తూ చాలా సార్లు పోస్టులు పెట్టారు. కుటుంబమే ఆశగా, శ్వాసగా భావించే ఆయన తాజాగా భార్య పద్మజను ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేయడంతో అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేడు ( డిసెంబర్ 26) నాగబాబు సతీమణి పద్మజ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ చెబుతూ కేక్‌ కట్‌ చేయించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు నాగబాబు. ''ఎంతో కఠినమైన ప్రపంచం ఇది. నా జీవితంలో నువ్వే లేకపోయుంటే ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడం మరింత కష్టమయ్యేది. నిత్యం నాతో ప్రేమగా మెదులుతూ, నీ ముందుచూపుతో అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేసినందుకు ధన్యవాదాలు. ప్రియాతి ప్రియమైన పద్మ.. నీకు జన్మదిన శుభాకాంక్షలు'' అని పేర్కొంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు నాగబాబు. ఈ పోస్ట్ చుసిన మెగా ఫ్యాన్స్ నాగబాబు సతీమణికి బర్త్ డే విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. రోజాతో కలిసి ‘జబర్దస్త్ కామెడీ షో’తో ట్రెండ్ క్రియేట్ చేశారు నాగబాబు. లాఫింగ్ స్టార్‌గా బుల్లితెరపై ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఊహించని విధంగా జబర్దస్త్ వీడిన నాగబాబు.. ఆ తర్వాత 'అదిరింది' అనే షో చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో యూట్యూబ్ వేదికగా పలు విషయాలు చెబుతూ మరో ట్రాక్ రెడీ చేసుకున్నారు ఈ మెగా బ్రదర్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mui1HF

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....