కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత వచ్చిన అఖండ మూవీ భారీ విజయం సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ఊపు తీసుకుకొచ్చింది. బాలకృష్ణ- కాంబోలో హాట్రిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీంతో ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న బోయపాటి టీమ్ పలు దేవస్థానాలు సందర్శిస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా విజయవాడ అమ్మవారిని దర్శించుకున్న బాలయ్య అండ్ టీమ్.. నిన్న (గురువారం) ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రవీందర్ రెడ్డి తదితరులతో కలిసి ఏడు కొండల స్వామిని దర్శించుకున్నారు . అక్కడ టీమ్ మొత్తానికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. పురోహితులు బాలయ్య, బోయపాటిలను ఆశీర్వదించారు. శ్రీవారి దర్శనం అనంతరం ‘అఖండ’ చిత్రానికి వేంకటేశ్వర స్వామి అఖండ విజయాన్ని ప్రసాదించారని బాలయ్య బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ''కరోనా వంటి విపత్కర పరిస్థితుల తర్వాత వచ్చిన అఖండ సినిమా ఎంతో మందికి ధైర్యాన్నిచ్చింది. ఈ ‘అఖండ’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టి మంచి విజయాన్ని అందించడం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయం తెలుగు సినీ పరిశ్రమకు ఉపిరిపోసినట్లయింది. ఆధ్యాత్మిక భావజాలంతో రూపొందించిన ‘అఖండ’ను ఆదరించిన అన్నివర్గాల ప్రేక్షకులు ఆదరించారు. ఈ సందర్భంగా ప్రేక్షక దేవుళ్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పాత రోజుల్లో తిరునాళ్లు, పౌరాణిక నాటకాలకు జనం వచ్చినట్లుగా అఖండ సినిమాకు వచ్చారు. అందరికీ నా కృతజ్ఞతలు'' అని అన్నారు. అనంతరం బోయపాటి శ్రీను, నిర్మాత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎప్పుడూ స్వామి వారి ఆశీస్సులతోనే సినిమా ప్రారంభిస్తామని అన్నారు. మానవ ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం ఉంటేనే ఇలాంటి విజయాలు అందుతాయని, ఈ క్రమంలోనే శ్రీవారిని దర్శించుకున్నట్టు వారు తెలిపారు. ప్రస్తుతం అఖండ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరి 10 కోట్లకు పైగా లాభాలతో ప్రదర్శించబడుతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dYK5yj
No comments:
Post a Comment