Tuesday, 28 December 2021

ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ.. ఇరగదీసిన జూనియర్ సమంత.. వీడియో వైరల్

సోషల్ మీడియా కారణంగానే ఫేమ్ కూడగట్టుకొని జూనియర్ సమంతగా నెటిజన్లకు సుపరిచితమైంది . అదే పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తనదైన ఆటతీరుతో బుల్లితెర ఆడియన్స్ మనసు దోచుకుంది. దీంతో బిగ్‌బాస్ షో తర్వాత ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. అప్పటిదాకా కొందరికే తెలిసిన అషు రెడ్డి.. బిగ్ బాస్ తర్వాత ప్రతి ఒక్కరికీ చేరువైంది. సినిమా ఆఫర్లు కూడా పెట్టేస్తూ బిగ్ సెలబ్రెటీగా మారింది. ఇక మరోవైపు తన అసలైన అస్త్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలతో నెటిజన్లను ఫిదా చేస్తోంది అషు రెడ్డి. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా సెన్సేషన్ అవుతున్న సాంగ్ 'ఉ అంటావా మావ... ఉఊ అంటావా మావ' పాటకు స్టెప్పులేసింది అషు. ఆమె చేసిన ఈ సాంగ్ ప్రోమో వీడియో రిలీజ్ చేయడంతో ఆన్ లైన్ మాధ్యమాలు షేక్ అవుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ మూవీలోని ‘ఉ అంటావా మావ... ఉఊ అంటావా మావ’ పాట ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందో చూస్తున్నాం. హీటు పుట్టించే మేకోవర్‌తో సమంత కాలుకదిపిన ఈ ఐటెం సాంగ్ దేశవ్యాప్తంగా మారు మోగుతోంది. పలువురు ఈ సాంగ్ స్పూఫ్ వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే సాంగ్‌ రీ క్రియేట్ చేస్తూ హంగామా చేసింది జూనియర్ సమంత అషు రెడ్డి. అచ్చం సమంత లాంటి కట్టుబొట్టుతో స్టెప్పేసి అభిమానులను మరింత హుషారెత్తించింది అషు. సమంతను మించి అన్నట్లుగా ఈ బిగ్ బాస్ బ్యూటీ వేసిన స్టెప్స్ వీడియోలో హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ మధ్యే సంచనల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మతో బోల్డ్‌ ఇంటర్య్వూలో పాల్గొని సోషల్‌ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది అషు రెడ్డి. మనసులో ఏదీ దాచుకోకుండా అన్ని విషయాలపై ఓపెన్ అయింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఒక్కసారిగా అషు క్యారెక్టర్, ఆమె ఓపెన్‌నెస్ జనాల్లో చర్చనీయాంశం అయ్యాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mHpQdf

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....