Tuesday, 14 December 2021

రాధే శ్యామ్ స్టోరీ ఇదే.. అది ప్రభాస్ ఆలోచనే అంటూ కథ అంతా రివీల్ చేసిన డైరెక్టర్

దేశ విదేశాల్లో ఉన్న ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ 'రాధే శ్యామ్'. దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే ఆడిపాడింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ ఇద్దరి లుక్స్, రొమాంటిక్ మూమెంట్స్ ఆడియన్స్‌కి కిక్కిచ్చాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఓ మీడియాతో ముచ్చటించిన డైరెక్టర్ రాధాకృష్ణ, ఈ మూవీ స్టోరీ లైన్ రివీల్ చేస్తూ సినిమా పట్ల ఉన్న ఆసక్తిని అమాంతం పెంచేశారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాను అబ్బాయి, అమ్మాయి మధ్య నడిచే రొమాన్స్ మాత్రమే కాదు లైఫ్ అండ్ డెత్ మధ్య సాగే సెలబ్రేషన్‌గా చూపించబోతున్నట్లు రాధాకృష్ణ తెలిపారు. లైఫ్‌కి డెత్‌కి మధ్య సెలబ్రేషన్ జరిగితే ఎలా ఉంటుందో `రాధేశ్యామ్` మూవీ కూడా అలాగే ఉంటుందని చెప్పారు. ఈ రోజుల్లో జాతకాలను నమ్మేవాళ్లున్నారు, అలాగే అస్సలు నమ్మని వాళ్లు కూడా ఉన్నారు. అయితే అందులో నిజమెంత? అబద్ధం ఎంత? అనే దానికి లవ్ స్టోరీని యాడ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనే ఈ `రాధేశ్యామ్` స్టోరీ అంటూ ఓపెన్ అయ్యారు రాధాకృష్ణ. ఇక ఈ సినిమాకు వింటేజ్ లుక్‌తో పాటు యూరప్ బ్యాక్‌డ్రాప్ ఎంచుకోవాలనేది మాత్రం ప్రభాస్ ఆలోచనే అని, ఆ క్రెడిట్ ప్రభాస్‌కే చెందుతుందని రాధాకృష్ణ అన్నారు. అయితే కథ అనుకున్న 15 ఏళ్ల తర్వాత ఈ కథ రాధేశ్యామ్ రూపంలో కార్యరూపం దాల్చడం వెనక ఓ ఆసక్తికరమైన అంశం దాగి ఉందని ఆయన తెలిపారు. కాకపోతే ప్రస్తుతానికి అది సీక్రెట్ అని, కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్ వేదికపై ఆ సీక్రెట్ బయటపెడతానని రాధాకృష్ణ చెప్పడం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30sAnRH

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw