Thursday, 23 December 2021

'భీమ్లా నాయక్' వాయిదాపై నిహారిక రియాక్షన్.. చరణ్‌ చెల్లెలిగా కాదు ఓ ఆడియన్‌గా చెబుతున్నా..!

ఈ ఏడాది సంక్రాంతికి పలు భారీ సినిమాలు సిద్దమైన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా కరోనా కారణంగా థియేటర్స్‌కి వెళ్లని ప్రేక్షకులను అలరించేందుకు స్టార్ హీరోలు రెడీ అయ్యారు. అయితే బిగ్గెస్ట్ ప్యాన్‌ ఇండియా సినిమాల విడుదల ఒకేసారి ఉండటంతో ప్రేక్షకుల నడుమ ఆరోగ్యకర వాతావరణం నెలకొల్పడం కోసం నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చి '' సినిమా రిలీజ్ వాయిదా వేశారు. అయితే జనవరి 7న RRR, జనవరి 14న రాధే శ్యామ్ భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూపై రియాక్ట్ అయింది మెగా డాటర్ . ప్యాన్‌ ఇండియా స్థాయిలో RRR, రాధే శ్యామ్ విడుదల నేపథ్యంలో భీమ్లా నాయక్ పోటీ నుంచి తప్పుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమాను ఫిబ్రవరి 25కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశ కలిగించడమే గాక రాజమౌళిపై ట్రోల్స్‌కి కారణమైంది. అయితే ఈ విషయమై స్పందించిన నిహారిక.. 'బాబాయ్‌ రావడం ఆలస్యం అవుతుందేమో కానీ.. బాక్సాఫీస్‌ బద్దలు కొట్టడం పక్కా' అంటూ మెగా అభిమానుల్లో జోష్ నింపింది. 'రావడం కాస్త లేటు అవ్వొచ్చు. కానీ రావడం మాత్రం పక్కా' అని మా బాబాయ్‌ ఓ సినిమాలో చెప్పినట్టు గానే 'భీమ్లా నాయక్ విడుదల కాస్త ఆలస్యం కావొచ్చు. కానీ బాక్సాఫీస్‌ బద్దలు కొట్టడం పక్కా' అని చెప్పింది నిహారిక. ఇదే క్రమంలో RRR మూవీ గురించి కూడా మాట్లాడిన ఆమె.. తారక్‌ అన్నయ్య ఎనర్జీ వేరే లెవెల్ అంటూ ఎన్టీఆర్‌ని తెగ పొగిడేసింది. ఆయన భార్య ప్రణతి తన క్లాస్‌మేట్‌ అని చెప్పింది. RRR ట్రైలర్‌ చూసిన వెంటనే చరణ్‌ అన్నని ప్రత్యేకంగా అభినందనలు తెలిపానని చెప్పింది. చరణ్‌ చెల్లెలిగా కాదు ఓ ఆడియన్‌గా చెబుతున్నా 'థియేటర్‌లో ఆ ట్రైలర్‌ చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచింది' అని నిహారిక చెప్పడం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qpARkm

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....