Thursday, 30 December 2021

RRR: టైటిల్ సీక్రెట్ రివీల్.. అందుకే ఆ పేరు పెట్టామంటూ రాజమౌళి ఓపెన్

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. భారీ బడ్జెట్ కేటాయించి ఎంతో గ్రాండ్‌గా తెరక్కెక్కించిన ఈ సినిమాను జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సినిమా పట్ల ఉన్న క్రేజ్ రెట్టింపు చేస్తూ వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. అన్ని భాషల్లోని ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తూ తనదైన ప్రమోషన్ స్ట్రాటజీతో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ హిందీ షోలో పాల్గొన్న రాజమౌళి.. RRR టైటిల్ సీక్రెట్స్ వెల్లడించారు. ఈ మూవీ ప్రారంభించినపుడు ఏ టైటిల్‌ పెట్టాలో అర్థం కాలేదని, ఆ తర్వాత కొన్ని రోజులకు RRR అనుకున్నామని రాజమౌళి తెలిపారు. , , రాజమౌళి పేర్లు కలిసొచ్చేలా ఈ ప్రాజెక్టును RRR అని పిలవాలనుకున్నామని, అదే కోణంలో RRR హ్యాష్‌ట్యాగ్‌తో సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇచ్చామని, అయితే ఈ పేరుకు అన్ని భాషల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో సినిమాకు అదే పేరు కన్ఫర్మ్ చేశామని రాజమౌళి చెప్పారు. RRR అంటే 'రౌద్రం రణం రుథిరం' అని ఫుల్ చెప్పారు జక్కన్న. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ రేంజ్‌లో ఈ మూవీ రూపొందించారు. ఇప్పటికే విడుదల చేసిన అన్ని అప్‌డేట్స్ రికార్డులు తిరగరాస్తూ మూవీ రిలీజ్‌కి ముందే RRR సత్తా ఏంటనేది తెలియజేశాయి. పీరియాడికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా అజయ్ దేవగన్, శ్రీయ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా వాయిదా పడుతుందనే రూమర్స్ షికారు చేస్తున్నప్పటికీ అలాంటిదేమీ లేదని అంటోంది చిత్రయూనిట్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mGJ1UA

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...