Saturday, 25 December 2021

‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాలో అలాంటి సీన్.. ప్రాక్టీస్‌ చేసినా వణుకు పుట్టింది: కృతి శెట్టి ఓపెన్

‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది యంగ్ హీరోయిన్ . బేబమ్మ పాత్రతో తనదైన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. యాక్షన్‌తో పాటు రొమాంటిక్ సీన్స్‌లోనూ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న ఆమెకు ఆ తర్వాత వరుస అవకాశాలు తలుపుతట్టాయి. ఈ క్రమంలోనే రీసెంట్‌గా విడుదలైన నాని ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సినిమా లోనూ కీర్తిగా అదరగొట్టింది ఈ కన్నడ బ్యూటీ. ఈ ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ చిత్రంలో నాని, సాయి పల్లవి నటనలతో పాటు కృతి శెట్టి నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కీర్తిగా తన క్యారెక్టర్‌కి కృతి శెట్టి పూర్తి న్యాయం చేసిందనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ చిత్రంలోని తన రోల్ గురించి, తదుపరి సినిమాల ప్రణాళికల గురించి ఓపెన్ అయింది కృతి. ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సినిమా కోసం తనను తాను చాలా మార్చుకున్నానని, ఇంగ్లిష్‌ సినిమాలు, మోడ్రన్‌ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకుని ఆ స్టైల్లో నటించానని కృతి చెప్పింది. ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెబుదామనుకున్నాని, అయితే వాయిస్‌‌లో బేస్ సూట్‌ కాకపోవడంతో చెప్పలేకపోయానని తెలిపింది. ఇక ఈ సినిమాలోని సిగరెట్ స్మోకింగ్ సీన్ గురించిన విషయాలు పంచుకున్న కృతి.. మొదట ఈ సీన్ తీసేయండని చెప్పానని, అయితే అది కీర్తి, నువ్వు కృతి.. తేడా ఉండాలి కదా? అని డైరెక్టర్ చెప్పడంతో చేయక తప్పలేదని తెలిపింది. అయితే ఈ సీన్ కోసం ప్రత్యేకంగా నికోటిన్ లేని సిగరెట్లు తెప్పించి షూట్ చేశారని చెప్పింది. సిగరెట్లను ఎలా తాగాలో మూడు రోజులు ప్రాక్టీస్‌ చేసినా కూడా తొలి రోజు షూట్‌లో తన చేతులు భయంతో వణికిపోయాయని చెప్పుకొచ్చింది కృతి శెట్టి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3EsFC1M

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....