Sunday, 26 December 2021

అనసూయ టచ్ చేసింది!.. గాల్లో తేలిపోయిన అభిమాని

బుల్లితెర అయినా వెండితెర అయినా అడుగు పెడితే సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక అనసూయ లాంటి గ్లామరస్ బ్యూటీలు బయటకు వస్తే జనాలు ఎలా ఎగబడతారో అందరికీ తెలిసిందే. కరోనా, ఒమిక్రాన్ వంటివి కూడా జనాలను ఆపలేవు. అలా ఖమ్మంలో షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన అనసూయ కోసం ఆమె అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. ఇక అనసూయతో ఫోటోలు దిగేందుకు, సెల్ఫీల కోసం నానా రకాల పాట్లు పడ్డారు. అయితే కొంత మందికి అనసూయకు అవకాశం ఇచ్చింది.. ఇంకొంత మందికి ఇవ్వలేకపోయింది. అనసూయ ఖమ్మంలో సందడి చేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ అభిమాని మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నాడు. అనసూయ తన చేతిని తాకిందంటూ గాల్లో తేలిపోయాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. అలా అభిమాని సంబరపడిపోవడంపై అనసూయ స్పందించింది. అయ్యో శానిటైజ్ చేసుకోండి అని అనసూయ కౌంటర్ వేసింది. మొత్తానికి అనసూయ తన చేతిని తాకడంతో ఆ అభిమాని మాత్రం గాల్లో తేలిపోయాడు. అనసూయ ఈ మధ్య సినిమాతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. దాక్షాయణిగా అనసూయ కనిపించింది. కానీ పుష్ప సినిమాతో అనసూయ ఏమంత ప్రభావం చూపించలేదు. రంగమ్మత్తలాంటి బలమైన పాత్ర మాత్రం అనసూయకు పడలేదనిపిస్తోంది. ఈ మధ్య అనసూయ జబర్దస్త్ షోలో కూడా కనిపించడం లేదు. ఈ వారం అనసూయకు బదులుగా రష్మీ వచ్చింది. వచ్చే వారం కూడా అనసూయ స్థానంలో రష్మీనే రాబోతోందని ప్రోమోను బట్టి తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3EsMyvY

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...