Friday, 17 December 2021

RRRలో ఎన్టీఆర్ ఉప‌యోగించిన‌ బైక్ వివ‌రాలు.. దాని కోసం జక్కన్న ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెరకెక్కించిన భారీ బ‌డ్జెట్ మూవీ RRR. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ సినిమా కోసం అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేస్తున్నారు. ఇప్పుడు ఎంటైర్ యూనిట్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఆదివారం (డిసెంబ‌ర్ 19)న ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జ‌ర‌గబోతుంది. బాలీవుడ్ సెల‌బ్రీటీలు ఈ వేడుక‌కి హాజ‌రు కాబోతున్నారు. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్‌, అండ్ టీమ్ ముంబైకి చేరుకున్నారు. అక్క‌డి మీడియాకి ప్ర‌త్యేక‌మైన ఇంట‌ర్వ్యూలు ఇచ్చే ప‌నిలో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. సాధార‌ణంగా రాజ‌మౌళి త‌న ప్ర‌తి సినిమాలో ప్ర‌తి చిన్న విష‌యాన్ని చాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి తెర‌కెక్కిస్తుంటారు. ముఖ్యంగా హీరోల లుక్స్‌తో పాటు వారు ఉప‌యోగించే వ‌స్తువులను కూడా రాజ‌మౌళి స్పెష‌ల్‌గా డిజైన్ చేయిస్తుంటారు. RRR సినిమాలో రామ్ చ‌ర‌ణ్ గుర్రాన్ని ఉప‌యోగిస్తే.. ఎన్టీఆర్ మోటార్ బైక్‌ను ఉప‌యోగించారు. ఎన్టీఆర్ బైక్ మోడల్ గురించి రాజ‌మౌళి చాలా రీసెర్చే చేశారు. దీని పేరు వెలో సెట్ మోటార్ బైక్‌. బ్రిట‌న్‌కు చెందింది. ఈ కంపెనీ హెడ్ ఆఫీసు బ‌ర్మింగ్ హామ్‌లో ఉంది. ఇక ఎన్టీర్ ఉప‌యోగించిన బైక్‌ 1934కి చెందిన ఎమ్ సిరీస్ మోడ‌ల్‌లా క‌నిపిస్తుంది. ఇక వెలోసెట్ మోటార్ బైక్ కంపెనీ 1920 నుంచి 1950 వ‌ర‌కు అంత‌ర్జాతీయ మోటార్ రేసింగ్ విభాగంలో టాప్‌గా ఉండేది. 350 సీసీ, 500 సీసీ బైకుల‌ను త‌యారు చేసింది. 1971లో ఈ కంపెనీ బైకుల ఉత్ప‌త్తిని పూర్తిగా ఆపేసింది. RRR కోసం ఎన్టీఆర్‌కు బైక్ కావాల‌నుకున్న‌ప్పుడు రాజ‌మౌళి అప్ప‌ట్లో బైకుల ఉత్ప‌త్తి చేయ‌డంలో ఎవ‌రు టాప్‌.. వారు త‌యారు చేసిన మోడ‌ల్స్ ఏంటి అనే వాటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి..ఇప్పుడున్న మోటార్ బైకునే అప్ప‌టి మోడ‌ల్‌లో క‌నిపించేలా దాదాపు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు పెట్టి మార్పులు, చేర్పులు చేసి మార్చారు. RRRలో గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. ఇంకా అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్, శ్రియా శ‌ర‌న్‌, స‌ముద్ర ఖ‌ని స‌హా హాలీవుడ్‌కి చెందిన ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి వంటి స్టార్స్ న‌టించారు. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ క‌లుసుకోని ఇద్ద‌రూ యోధులు క‌లుసుకుని బ్రిటీష్ వారిపై యుద్ధం చేస్తే ఎలా ఉంటుంద‌నే ఫిక్ష‌న‌ల్ క‌థాంశంతో రూపొందిన చిత్ర‌మే RRR. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3IZIBSR

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...