నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్' రూపొందింది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాను 1970లలో కలకత్తాలో ఉన్న దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా చేసుకుని తెరకెక్కించారు. దేవదాసీ పాత్రలో సాయిపల్లవి నటించగా, టైటిల్ రోల్ నాని చేశాడు పోషించారు. నేడు (డిసెంబర్ 24) విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్, యూఎస్‌లో ప్రీమియర్స్ చూసిన పబ్లిక్ ట్విట్టర్ వేదికగా సినిమాపై తమ రివ్యూస్ పోస్ట్ చేస్తున్నారు. అందులో కొన్నింటి ఆధారంగా ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.. వరుస పరాజయాలతో సతమతమవుతున్న నాని డిఫరెంట్ క్యారెక్టర్‌తో 'శ్యామ్ సింగరాయ్' రూపంలో బరిలోకి దిగారు. ఈ సినిమాకు ఆయన రోల్ మేజర్ అసెట్ అయిందనే టాక్ వస్తోంది. రాహుల్ డైరెక్షన్, నాని- సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతో బాగున్నాయని అంటున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి తన నటనతో ఇరగదీసిందనే టాక్ బయటకొచ్చింది. వాళ్ళిద్దరి ప్రేమ కథను అద్బుతంగా తీర్చిదిద్దారని అంటున్నారు. ఫస్టాఫ్ కాస్త సాగదీతగా అనిపించినా, సెకండాఫ్ బాగా వచ్చిందనే టాక్ నడుస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్, సాంగ్స్, కొన్ని మాస్ సన్నివేశాలతో పాటు నాని- సాయి పల్లవి జోడీ ఈ సినిమాలో హైలైట్ అయ్యారని అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ అనే టాక్ రావడం విశేషం. మొత్తంగా చూస్తే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందనే చెప్పుకోవాలి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pnMJEe
No comments:
Post a Comment