కొన్నాళ్లు ముందు సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఓ మైనర్ బాలిక హత్యకు గురైంది. ఆ హత్యకు సంబంధించిన వివరాలను కళ్యాణి వెల్లడించే ప్రయత్నాలు ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి సంబంధించిన ఏల్లమ్మ బండలోని తూటం శెట్టి నితేష్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రైవేటుగా కంప్లైంట్ దాఖలు చేశారు. కంప్లైంట్‌ను పరిశీలించిన కోర్టు కరాటే కళ్యాణిపై కేసు నమోదు చేయాలని జగద్గిరి గుట్ట పోలీసులను ఆదేశించింది. ఆదేశాల ప్రకారం పోలీసులు కళ్యాణిపై కేసు నమోదు చేశారు. దీనిపై నటి కరాటే కళ్యాణి వివరణ ఇస్తూ మాట్లాడారు. ఓ ఆధ్యాత్మిక సంస్థ హిందూ మతం పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూల చేస్తుంటే ప్రశ్నించినందుకు తనపై తప్పుగా వార్తలు రాయించి ట్రోల్ చేస్తున్నారంటూ కళ్యాణి మండిపడ్డారు. కరాటే కళ్యాణి మాట్లాడుతూ ‘‘శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక అనే సంస్థను స్టార్ట్ చేసిన కరుణాకర్ సుగుణ, కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి వంటి తొమ్మిది దీన్ని స్టార్ట్ చేశారు. కొంత మందిని బయటకు పంపేసి ఐదుగురు మాత్రమే ఇప్పుడు డైరెక్టర్స్‌గా ఉంటూ వస్తున్నారు. వీళ్లు 2020లో ఆఫీస్ స్టార్ట్ చేయాలని చెబుతూ కోటి రూపాయలు ఫండ్స్ కలెక్ట్ చేశారు. ఆఫీస్ అంతా స్టార్ట్ అయ్యిందని చెప్పిన తర్వాత మళ్లీ ఆరు నెలల వ్యవధిలోనే కోటిన్నర రూపాయలు ఫండ్ కలెక్షన్స్ కోసం రెడీ అయ్యారు. ప్రశ్నించినందుకు మాపై ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. వారు చేసిన పనులకు మా సాక్ష్యాధారాలున్నాయి. ఈ కేర్ ప్రై.లి. సెంటర్, శివ శక్తి ఫౌండేషన్, శివ శక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక అనే మూడు సంస్థలు కలిసి గేమ్ ఆడుతున్నాయి. మోసం జరుగుతుందని నేను ప్రశ్నిస్తే.. నాపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడున్న దేవిరెడ్డి ఆనంద్ రెడ్డికి ఆర్‌బీఎల్ బ్యాంకులో రెండున్నర కోట్ల రూపాయలు అప్పులున్నాయి. దాన్ని తీర్చడం కోసం ఫండ్ రైజింగ్ పేరుతో గేమ్‌లాడుతున్నారు. నిధులను పక్క దారి పట్టిస్తున్నారు. కార్పొరేట్ లెవల్లో మనీ ల్యాండరింగ్ జరుగుతుంది. వారి మోసాలను ప్రశ్నించినందుకు నన్ను తిట్టారు. నాపై తప్పుడు కేసులు పెట్టారు. నేను బాలిక కుటుంబానికి సపోర్ట్ చేయడానికి వెళితే, నేను హత్య కేసులో ఇరుక్కున్నానంటూ తప్పుగా ట్రోల్ చేశారు. నేను ఏ హత్య కేసులో ఇరుక్కున్నానో చెప్పాలి. ఆధారాలతో పోరాటం చేస్తుంటే బెదిరిస్తున్నారు’’ అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Hhghd3
No comments:
Post a Comment