Thursday, 30 December 2021

LIGER Glimpse: వి ఆర్ ఇండియన్స్ అంటూ గర్జించిన విజయ్ దేవరకొండ.. వీడియో అదుర్స్

హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లైగర్' మూవీ నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా వదిలి విజయ్ దేవరకొండ అభిమానుల్లో జోష్ నింపారు. పూరీ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన ఈ వీడియో విడుదలైన క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇండియన్ బాక్సర్‌గా విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ ఎంట్రీ హైలైట్ అయింది. ముంబై చాయ్ వాలా బాక్సింగ్ పోటీకి వెళ్లి 'వి ఆర్ ఇండియన్స్' అంటూ గొంతెత్తి చెప్పడం సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. పవర్‌‌ఫుల్‌ బాడీతో విజయ్ దేవరకొండ రింగ్‌ లోకి దిగే సీన్‌ రోమాలు నిక్కబొడిచేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజయ్ మ్యానరిజం ఈ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. మొత్తానికి విజయ్ దేవరకొండ కొత్త సంవత్సర కానుక అదిరిందని చెప్పుకోవచ్చు. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న లైగర్ సినిమాకు 'సాలా క్రాస్ బ్రీడ్' అనే పవర్‌ఫుల్ ట్యాగ్ లైన్‌ పెట్టారు పూరి. బాక్సింగ్ నేపథ్యంలో భారీ రేంజ్‌లో ఈ సినిమాను రూపొందించారని తాజాగా విడుదలైన గ్లింప్స్‌తో అర్థమవుతోంది. చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో ముఖ్యపాత్రలో కనిపించనుంది. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ లైగర్ సినిమా నిర్మాణంలో ఛార్మి భాగమైంది. వచ్చే ఆగస్టు 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FUnH5q

No comments:

Post a Comment

'Acting Is Such A Rich Man's Business Now'

'It's no more just art and skills, it's a business.' from rediff Top Interviews https://ift.tt/rQNK1fd