
బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి.. సినిమాల్లో చాలా తక్కువగా నటించారు. బిగ్ బాస్ షో కంటే ముందుగానే ఛల్ మోహన రంగ అనే సినిమాలో కనిపించారు. బిగ్ బాస్ షో అనంతరం అంతగా సినీ అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ బ్యూటీ హీరోయిన్‌గా రాబోతోన్నారు. విజయ్ శంకర్ హీరోగా, అషూ రెడ్డి హీరోయిన్‌గా స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ ‘ఫోకస్’ అనే సినిమాను చేస్తున్నారు. ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా జి. సూర్యతేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఫోకస్’ మూవీ తెరకెక్కుతోంది. ప్రముఖ నటి మణిరత్నం కీలక పాత్ర పోషిస్తుండగా.. బిగ్ బాస్ ఫేమ్ అషూరెడ్డి హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయ్ శంకర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా సుహాసిని మణిరత్నం జడ్జ్ పాత్రలో నటిస్తున్నారు. భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ‘ఫోకస్’ అని టైటిల్ పెట్టడంతోనే తమ సినిమాపై ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్ ఫోకస్ కూడా పడిందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. మర్డర్ మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు తమ చిత్రం కొత్త తరహా అనుభూతిని ఇస్తుందనీ, సినిమా గురించిన మరిన్ని విశేషాలు, వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్ర దర్శకుడు సూర్యతేజ తెలిపారు. అంతే కాకుండా అషూ తన ఇన్ స్టాగ్రాంలో ఓ పోస్ట్ చేశారు. రేపు (డిసెంబర్ 27) ఉదయం 11:55 గంటలకు సినిమాకు సంబంధించిన టైటిల్ లుక్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇదే విషయాన్ని అషూ చెప్పుకొచ్చారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mylrcq
No comments:
Post a Comment