Tuesday, 21 December 2021

నా వెనక ఉంది నువ్వే.. ఎంత పేరొచ్చినా ఆ క్రెడిట్ నీదే డార్లింగ్! అల్లు అర్జున్ ఎనర్జిటిక్ స్పీచ్

హీరోగా దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'పుష్ప' భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ దాడి చేస్తోంది. తొలుత ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బన్నీ నటనతో పాటు సుకుమార్ నేరేషన్, ఇతర నటీనటుల యాక్టింగ్‌పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు నీరాజనం పలుకుతున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో ఎంతో సంతోషంలో ఉన్న చిత్రయూనిట్ డిసెంబర్ 21వ తేదీన తిరుపతిలో మాసివ్ సక్సెస్ పార్టీ నిర్వహిచారు. ఈ వేడుకలో అల్లు అర్జున్, రష్మిక స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఇక వేదికపైకి వచ్చిన అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని డైలాగులతో సభా ప్రాంగణాన్ని హూషారెత్తించారు. మరోసారి రష్మికపై తన ఇష్టాన్ని బయటపెడుతూ సుకుమార్‌పై ప్రశంసలు గుప్పించారు. డార్లింగ్ అంటూ ఆయనపై ఎంతో ప్రేమ చూపించారు. చిత్తూరు యాసలో మాట్లాడుతూ అక్కడి అభిమానులతో గోల పెట్టించారు. ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ 'పుష్ప' తొలి సక్సెస్ వేడుక చిత్తూరులో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ''ఇవాళ నా నటనకు, సినిమాకు ఎంత పేరొచ్చినా.. ఆ క్రెడిట్ మొత్తం సుకుమార్‌దే. ఏడు కొండల వెంకన్న స్వామి మీ అందరి వెనక ఎలా ఉన్నాడో.. సుక్కు నా వెనక అలా ఉన్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన ఆల్బమ్‌ ఇచ్చాడు. ఇక ఖర్చు విషయంలో తగ్గేదే లే అంటూ ప్రోత్సహించారు మా చిత్ర నిర్మాతలు. నా తోటి నటీనటుల ప్రోత్సాహం వల్లే సినిమాలో నేనంత బాగా నటించగలిగాను. సునీల్, అనసూయా చాలా బాగా నటించారు. నాకు అందరి సపోర్ట్ దక్కింది. నేను చిత్తూరు యాస నేర్చుకోవడంలో జష్వంత్‌, ప్రవీణ్‌, చిట్టేటి మోహన్‌ ఎంతో సహాయం చేశారు. ఇది ప్రేక్షకుల విజయం. పుష్ప మూవీని ఇంత బాగా ఆదరిస్తున్న సినీప్రియులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా'' అన్నారు అల్లు అర్జున్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3EpVmmk

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....