ఐకాన్ స్టార్ , క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సక్సెస్‌ఫుల్ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'పుష్ప' మూవీ నేడు (డిసెంబర్ 17) ప్రేక్షకుల ముందుకొచ్చింది. షూటింగ్ ప్రారంభం నుంచి డైరెక్టర్ సుకుమార్ వదిలిన ప్రతి అప్‌డేట్ కూడా బాగా వైరల్ కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. దీంతో భారీ అంచనాల నడుమ పుష్ప రాజ్ థియేటర్లలో అడుగుపెట్టారు. ఎప్పటిలాగే ఓవర్సీస్‌లో 'పుష్ప' ప్రీమియర్ షోస్ పడ్డాయి. అయితే విడుదలకు ముందు నెలకొన్న భారీ హైప్‌తో యూఎస్ ప్రీమియర్స్‌కి ఈ ఏడాది ఏ సినిమాకు లేనంతగా డిమాండ్ నెలకొంది. విదేశాల్లోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ 'పుష్ప ది రైజ్' చూసేందుకు క్యూ కట్టేశారు. మొత్తంగా యూఎస్ లోని 248 లొకేషన్స్‌లో పుష్ప చిత్రాన్ని విడుదల చేయగా.. ఈ ప్రీమియర్స్ ద్వారా దాదాపు 406k డాలర్స్ వసూలు చేశాడు పుష్పరాజ్. తద్వారా 2021 సంవత్సరంలో బిగ్గెస్ట్ ప్రీమియర్స్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన తొలి రెండు చిత్రాల్లో ఒకటిగా పుష్ప నిలిచింది. ఇకపోతే ప్రీమియర్స్ షోస్ చూసిన ఆడియన్స్ పుష్ప సినిమాపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇది అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని, పుష్పరాజ్‌గా బన్నీ అదరగొట్టేశారని అంటున్నారు. కాకపోతే ఓవరాల్‌గా ఈ సినిమా ఊహించిన అంచనాలను అందుకోలేక పోయిందని చెబుతున్నారు. సుకుమార్ టేకింగ్, పుష్ప తొలి భాగానికి రెండో భాగానికి లింక్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముత్తంశెట్టి మీడియా అసోషియేషన్‌లో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ కేటాయించి ఈ ‘పుష్ప’ మూవీ రూపొందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజయ్యింది. సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఈ సినిమాలో హైలైట్ అయిందట. రష్మిక పోషించిన శ్రీ వల్లి పాత్ర, అనసూయ చేసిన దాక్షాయణి రోల్, సునీల్ చేసిన మంగళం శీను పాత్రలు ఫర్వాలేదనిపించాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yzwrv8
No comments:
Post a Comment