Monday, 27 December 2021

చచ్చిపోయా.. ఆ వీడియో షేర్ చేస్తూ సమంత రియాక్షన్! మనసులోని స్ట్రాంగ్‌ ఫీలింగ్స్ బయటపెట్టిందిలే..

పట్టలేని ఆనందం వచ్చినా, ఆపుకోలేని దుఃఖం వచ్చినా.. చచ్చిపోయారా బాబు అనేది సాధారణంగా సగటు మనిషి నోట పలికే మాట. స్టార్ హీరోయిన్ కూడా అచ్చం అలాగే ఫీల్ అవుతోంది. తాను రీసెంట్‌గా చేసిన ఐటెం సాంగ్ రెస్పాన్స్ చూసి ఆనందం తట్టుకోలేక 'డెడ్' అనేసింది సామ్. ఈ మేరకు తనలోని స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆ ఒక్క పదం రూపంలో బయటపెడుతూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది సమంత. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీర్చిదిద్దిన 'పుష్ప' సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ''ఉ అంటావ మావ.. ఉ ఊ అంటావ మావ'' అంటూ హీటెక్కించింది సామ్. దీంతో జనరల్‌గా సుక్కు ఐటెం సాంగ్‌కి ఉండే డిమాండ్‌ని 100 రెట్లు పెంచేసింది ఈ సాంగ్. అల్లు అర్జున్‌తో కలిసి సమంత చేసిన డాన్సింగ్ మూమెంట్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక యూట్యూబ్‌లో ఈ సాంగ్ సృష్టిస్తున్న అలజడి అంతాఇంతా కాదు. ఎక్కడ చూసినా ఈ సాంగ్ మోత మోగుతోంది. చిన్న- పెద్ద అనే వయసు బేధం, ఆడ- మగ అనే లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరి పెదాలపై ఇదే సాంగ్ కదలాడుతోంది. ఎంతోమంది ఈ పాటను స్ఫూప్‌ వీడియోలు చేశారు. సాంగ్ రీక్రియేట్‌ చేసి రీల్స్‌, షార్ట్స్‌ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ చిన్నారి వీడియో వైరల్ అయింది. తన తల్లి ‘హు( Who)’ అనే ఇంగ్లీష్ పదాన్ని నేర్పే ప్రయత్నం చేస్తుంటే ఆ పాప మాత్రం క్యూట్‌గా ‘ఉ అంటావా మావ.. ఉ ఊ అంటావా మావ’ అని పాడేస్తోంది. అయితే ఈ వీడియో సమంత కంట పడటంతో సంతోషం పట్టలేక దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ 'డెడ్' అని ట్యాగ్ లైన్ జత చేసింది. దీంతో సమంత ఫ్యాన్స్ ఇది చూసి క్రెడిట్ అంటే ఇలా ఉంటుంది మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sIe6en

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....