Saturday, 18 December 2021

బాహుబలి- 3పై రాజమౌళి కీలక వ్యాఖ్యలు.. అసలు విషయం బయటపెడుతూ సెన్సేషన్

ఇండియన్ సినిమా హిస్టరీలో బాహుబలి క్రియేట్ చేసిన అలజడి గురించి ప్రతి ఒక్క ప్రేక్షకుడికీ తెలుసు. ఓ తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి తెలుగోడి సత్తాను శిఖరమెక్కించ్చింది బాహుబలి సినిమా. దర్శక ధీరుడు దర్శకత్వంలో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పలు రికార్డులు తిరగరాసి ఇండస్ట్రీలోని దాదాపు అన్ని రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అలాంటి ఈ సినిమా మూడో భాగం కూడా వస్తుందంటే ఇక ప్రేక్షకుల ఆనందానికి అవధులుంటాయా? అలాంటి కీలక విషయంపై రియాక్ట్ అయ్యారు జక్కన్న. ప్రస్తుతం సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి.. ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. జనవరి 7వ తేదీన ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ ఉన్న నేపథ్యంలో మీడియా ముందుకొస్తూ పలు విషయాలపై స్పందిస్తున్నారు. అయితే రీసెంట్‌గా జరిగిన ఓ సమావేశంలో RRR మూవీతో పాటు బాహుబలి-3కి సంబంధించిన ప్రశ్న ఆయనకు ఎదురుకావడంతో ఊహించని సమాధానమిచ్చారు. బాహుబలి-3 ఉంటుందన్నట్లుగా హింట్ ఇచ్చి హూషారెత్తించారు జక్కన్న. బాహుబలి సినిమా తమ యూనిట్ మొత్తానికి ఎంతో స్ఫూర్తినిచ్చిందని, తప్పకుండా బాహుబలి లాంటి సినిమా కథను కొనసాగించే అవకాశం ఉందని రాజమౌళి చెప్పడం విశేషం. బాహుబలి సినిమాలోని పాత్రలు, కథనం కూడా మరో సినిమా చేసేందుకు నమ్మకాన్ని కూడా కలిగిస్తాయని అన్నారు. మూడో భాగం ఉంటుందని చెప్పగలను కాకపోతే ప్రస్తుతం RRR సినిమా గురించి తప్ప మరో విషయం మాట్లాడలేనని చెప్పారు. ఈ పరిస్థితుల్లో అంశం చర్చకు రావడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. కాగా, RRR మూవీ తరవాత రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా రానుంది. ఈ సినిమా కోసం జక్కన్న మరో రెండు మూడేళ్లు టైమ్ తీసుకుంటరాని చెప్పవచ్చు. ఆ తర్వాత ప్రభాస్‌తో ఓ ప్రాజెక్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో.. అదే బాహుబలి సినిమాకు మూడో భాగం కానుందా? లేదా అనేది ఇప్పటికైతే సస్పెన్స్. ఇకపోతే జక్కన్న తెరకెక్కిస్తున్న RRR మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా, కొమురం భీం రోల్ ఎన్టీఆర్ పోషిస్తున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Edk4pE

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....