Friday, 17 December 2021

పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’కి షాకిచ్చిన హీరోయిన్... కారణమదేనా?

పవర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న పీరియాడిక్ చిత్రం ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’. జాగ‌ర్ల మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎ.ఎమ్‌.ర‌త్నం నిర్మాత‌. ఇప్ప‌టికే ఈ సినిమా 60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బందిపోటు పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. కాగా.. ఈ సినిమా నుంచి బాలీవుడ్ హీరోయిన్ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ త‌ప్పుకుంద‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్ ప్ర‌కారం ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ అనుకున్నారు. అందులో పంచ‌మి అనే పాత్ర‌లో నిధి అగ‌ర్వాల్‌ న‌టిస్తోంది. ఆమె పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను కూడా ఇటీవ‌ల చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాగా.. మ‌రో హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌ను అనుకున్నారు. ఆమె కూడా డేట్స్‌ను కేటాయించింది. అయితే క‌రోనా ప‌రిస్థితులు, మ‌రో వైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది. దీంతో జాక్వలైన్ ఫెర్నాండెజ్‌కు కేటాయించిన డేట్స్‌లో షూటింగ్‌ను పూర్తి చేయ‌లేక‌పోయారు. కొత్త డేట్స్‌ను కేటాయించాలంటే ఆమె మ‌రింత రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసింద‌ని, ఆ కార‌ణంతో.. హ‌రి హ‌ర వీరమ‌ల్లు నిర్మాత‌లు జాక్వలైన్ స్థానంలో మ‌రో హీరోయిన్‌ను తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. బాలీవుడ్ హీరోయిన్ న‌ర్గీస్ ఫ‌క్రీని జాక్వలైన్‌కు బ‌దులుగా రీ ప్లేస్ చేసే అవ‌కాశం ఉంద‌ని న్యూస్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు.. మెఘ‌లు కాల‌పు నేప‌థ్యంలో సాగే సినిమా. న‌ర్గీస్ ఫ‌క్రీ ఈ సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకుంటే ఆమె మెఘ‌లు యువ‌రాణి పాత్ర‌లో క‌నిపిస్తుంది. అలాగే మొఘ‌లు చ‌క్ర‌వ‌ర్తిగా ఇందులో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ క‌నిపించ‌బోతున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా విడుద‌ల‌కానుంది. వ‌చ్చే ఏడాది వేస‌విలో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌నేది బ‌య‌ట వినిపిస్తోన్న వార్త‌లు. ఇది వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్ర‌కు సంబంధించి విడుద‌లైన చిన్న ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌రో వైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న భీమ్లా నాయ‌క్‌గా అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3p8OIfP

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....