బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీస్‌తో సందడి చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 14న తన మరో పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్‌తో థియేటర్స్‌లో సందడి చేయడానికి రెడీ అయిపోయారు ప్రభాస్. తమ అభిమాన కథానాయకుడిని వెండితెరపై చూసి రెండుళ్లు దాటేయడంతో డార్లింగ్ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. ఇప్పటికే పాటలను విడుదల చేస్తున్న మేకర్స్.. ఇప్పుడు ప్రమోషన్స్‌ను నెక్ట్స్ స్టెప్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నారు. అందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ప్రణాళికలో భాగంగా రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో డిసెంబర్ 23న ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు జరుగుతున్నాయట. ఇప్పటికే రాధే శ్యామ్ టీమ్ ఫిలింసిటీలో ఓ ప్రాంతాన్ని తీసుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సెట్ వేయడం ప్రారంభించిందట. ప్రీ రిలీజ్ కోసం సెట్ వేయడమేంటి? అనే సందేహం రాక మానదు. కానీ ఇది నిజమేనని సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం. ఇంతకీ ముందస్తు వేడుక కోసం ప్రభాస్ అండ్ టీమ్ వేస్తున్న సెట్ ఏంటో తెలుసా!.. యూరప్ సెట్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చే అభిమానులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తూ.. ఈవెంట్‌లోకి రాగానే యూరప్‌లో ఉన్న అనుభూతి కలిగేలా ఓ డిఫరెంట్ సెట్‌ను వేస్తున్నారట మరి. విషయం వింటుంటే ఇలా ఉంటే రేపు ప్రీ రిలీజ్ సెట్ ఎలా ఉండబోతుందనేది మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మించారు. యూరప్ నేపథ్యంలో సాగే పీరియాడికల్ లవ్ స్టోరి ఇది. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తుంది. ప్రభాస్ పాత్రకి చేతి రేఖలను చూసి భవిష్యత్తుని చెప్పేసే శక్తి ఉంటుంది. తను ప్రేయసి పూజా హెగ్డే చేతి రేఖలను చూసి ఆమెకు భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని గ్రహించి ఆమెను ఎలా కాపాడుకున్నాడనేదే రాధే శ్యామ్ కథాంశం అని సినిమా గురించిన స్టోరి నెట్టింట చక్కర్లు కొడుతుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3shWXb4
No comments:
Post a Comment