Sunday, 26 December 2021

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ సర్ ప్రైజ్ గిఫ్ట్... న్యూ ఇయర్ రోజున పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి పండగే!

పవర్ స్టార్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘’.ఇందులో రానా ద‌గ్గుబాటి కూడా మ‌రో హీరోగా క‌నిపించ‌నున్నారు. ఈయ‌న పాత్ర పేరు డానియ‌ల్ శేఖ‌ర్‌. ఇద్ద‌రి పాత్ర‌ల‌కు సంబొంధించిన క్యారెక్ట‌ర్స్ ఎలివేష‌న్ ప్రోమోలు కూడా విడుద‌లై మంచి ఆద‌ర‌ణ‌ను పొందాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అంటే ఎలాంటి అంచ‌నాలుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హై ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌గా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు, సాంగ్స్ ఈ అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచుతూనే వ‌స్తున్నాయి. కాగా.. ఈ అంచాల‌ను మ‌రింత పెంచ‌డానికి మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు. అది కూడా కొత్త సంవ‌త్స‌రం రోజున‌. ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌ను మ‌రింత స్ట్రాంగ్‌గా ఇవ్వాల‌నుకున్నారు. అందు కోసం ‘భీమ్లా నాయక్’ ద‌ర్శ‌క నిర్మాత‌లు ఓ భారీ ప్లాన్ చేశారు. అందులో భాగంగా డిసెంబ‌ర్ 31న ఓ పాట‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆ ఏముందిలే పాటే కదా! అని అనుకోకండి బాబూ.. ఈ పాట‌ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాడారు. సాధార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ సినిమాలో పాట రిలీజ్ అంటేనే ఫ్యాన్స్ చేసే హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇప్పుడు ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాడిన పాట‌.. అది కూడా న్యూ ఇయ‌ర్ రోజున రిలీజ్ అవుతుందంటే అభిమానుల చేసే హడావుడి మ‌రో రేంజ్‌లో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే ‘భీమ్లా నాయక్’ సినిమాకు అద్భుత‌మైన ట్యూన్స్ అందించిన మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ త‌మ‌న్‌, స్వ‌యంగా పవ‌న్ క‌ళ్యాణ్ పాడుతున్న పాట‌కు ఎలాంటి ట్యూన్ అందించారో తెలియాలంటే మాత్రం మ‌రో ఐదు రోజులు ఆగాల్సిందే. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌’కు రీమేక్‌గా రూపొందుతోన్న ‘భీమ్లా నాయక్’ను ముందుగా సంక్రాంతి బ‌రిలోకి, జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయాల‌ని ముందుగా నిర్మాత‌లు భావించారు. అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. కానీ RRR, రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు భారీ ఎత్తున విడుద‌ల‌వుతుండ‌టంతో స‌ద‌రు నిర్మాత‌లు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ‘భీమ్లా నాయక్’ నిర్మాత‌ల‌ను క‌లిసి రిక్వెస్ట్ చేయ‌డంతో ‘భీమ్లా నాయక్’ వాయిదా ప‌డ్డాడు. ప్ర‌స్తుతం ‘భీమ్లా నాయక్’ను శివ రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేస్తున్నారు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న భీమ్లా నాయ‌క్ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, రైట‌ర్ త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, మాట‌ల‌ను అందించారు. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప‌వ‌న్ జోడీగా నిత్యామీన‌న్‌.. రానా ద‌గ్గుబాటి జోడీగా సంయుక్తా మీన‌న్ న‌టించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eqqSpC

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...