Sunday, 19 December 2021

RRR Pre Release Eventలో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు స‌ల్మాన్ ఖాన్ వార్నింగ్‌..

ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న భారీ చిత్రం RRR. కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా జ‌న‌వ‌రి 7, 2022న విడుద‌ల‌వుతుంది. ప్ర‌స్తుం సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ చాలా వేగంగా, ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతూ వ‌స్తున్నాయి. భారీ బ‌డ్జెట్‌, తారాగ‌ణంతో చేసిన సినిమా కావ‌డంతో జ‌క్క‌న్న అండ్ టీమ్ సినిమాను ప్ర‌మోట్ చేయ‌డంలో ప్ర‌తి విష‌యాన్ని వ‌దిలి పెట్ట‌డం లేదు. ఆదివారం ముంబైలో గ్రాండ్ లెవ‌ల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. దీనికి బాలీవుడ్ మెగాస్టార్ స‌ల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో స‌ల్మాన్ ఎంట్రీ అదిరిపోయింది. జిలుగుల వెలుగు కాంతిలో క్రేన్‌తో అమ‌ర్చిన స్పెష‌ల్ వాహ‌నంలో పై నుంచి కింద‌కు దిగి మాస్ ఎంట్రీ ఇచ్చారు సల్మాన్ భాయ్. ఇక స్టేజ్‌పై ఆయ‌న RRR ఎంటైర్ యూనిట్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఎన్టీఆర్ న‌ట‌న‌ను ఎంతగానో ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పిన ఆయ‌న రామ్ చ‌ర‌ణ్‌లా హార్డ్ వ‌ర్కింగ్ ప‌ర్స‌న్‌ను తాను చూడ‌లేద‌ని అన్నారు. RRR గురించి ఎంటైర్ ఇండియా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోంద‌ని చెప్పిన సల్మాన్.. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని, RRR విడుదలైన నాలుగు నెలల వరకు మ‌రో సినిమా రిలీజ్ కాకుండా ఉంటే బావుంటుంద‌ని అన్నారు. అంటే ఇన్ డైరెక్ట‌ర్‌గా ఈ కండ‌ల వీరుడు RRR సినిమాకు ఎదురు లేదు, ఎదురు రాకండి అని వార్నింగ్ ఇచ్చేశారు. RRR Pre Release Eventను ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌ల క‌ర‌ణ్ జోహార్ హోస్ట్ చేయ‌డం విశేషం. RRR Pre Release Eventను టీవీల్లో వీక్షించాల‌ని ఎంతో మంది అభిమానులు ఆశ ప‌డ్డారు. కానీ నిర్వాహ‌కులు అందుకు అవ‌కాశం ఇవ్వ‌లేదు. డిసెంబ‌ర్ 31న ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ ఛానెల్‌లో సద‌రు ప్ర‌సారం అవుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక RRR సినిమా విషయానికి వ‌స్తే ఇది రూ.400 కోట్లతో రూపొందిన భారీ బ‌డ్జెట్ మూవీ. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌తో పాటు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్ వంటి బాలీవుడ్ న‌టులు.. హాలీవుడ్ స్టార్స్ కూడా ఇందులో న‌టించారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ మూవీ ఇది. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా కావ‌డంతో RRRపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pbLVCA

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....