Friday, 17 December 2021

సినిమా పాత్రల కోసం అలాంటి పనులు చేయనంటున్న రకుల్ ప్రీత్ సింగ్

.. ఫిట్‌నెస్ ఫ్రీక్ అనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఏమాత్రం ఖాళీ దొరికినా ఈ అమ్మ‌డు త‌న లుక్‌, ఫిట్‌నెస్‌పై ఫోక‌స్ పెడుతుంటారు. అందుకే మూడు ప‌దులు వ‌య‌సు దాటినా గ్లామ‌ర్ ప‌రంగా కుర్ర హీరోయిన్స్‌కు ఇప్ప‌టికీ పోటీ ఇస్తుంటుందీ సొగ‌స‌రి. సినిమా పాత్రల గురించి మట్లాడుతూ ఓ సందర్భంలో ఆమె ఎలాంటి పాత్రలను చేయనో వివరించింది. ఇంతకీ రకుల్ ఎలాంటి పాత్రలు చేయరు. ఎందుకు చేయరు అనే వివరాల్లోకి వెళితే.. ఓ ఓ ఇంట‌ర్వ్యూలో రకుల్ పాత్రల ఎంపిక గురించి ప్ర‌శ్నిస్తే ‘‘సాధార‌ణంగా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయ‌డానికి యాక్ట‌ర్స్ ఆస‌క్తి చూపుతుంటారు. నేను కూడా అందుకు సిద్ధ‌మే. అయితే పాత్ర కోసం బ‌రువు పెర‌గాల‌న‌డం, త‌గ్గాల‌నడం అంటే మాత్రం ఆ పాత్ర చేయ‌లేను. వెంట‌నే బ‌రువు పెర‌గ‌డం, ఆ వెంట‌నే బ‌రువు త‌గ్గ‌డం అనేది నా వ‌ల్ల కాదు. అది స‌హ‌జంగా జ‌ర‌గాల్సిన ప్ర‌క్రియ‌. అలా వెంట‌నే బ‌రువు పెర‌గ‌డం, త‌గ్గ‌డం వ‌ల్ల అది శ‌రీరంపై ఎక్కువ ప్ర‌భావాన్ని చూపిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందుక‌నే నేను అలాంటి త‌ప్పులు చేయ‌ను. ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తాను. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌రువు పెర‌గ‌డం, త‌గ్గడం వంటి పాత్ర‌లు చేయ‌మ‌ని న‌న్ను ఎవ‌రూ సంప్ర‌దించ‌లేదు’’ అని అన్నారు ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్. పుష్క‌ర కాలంగా హీరోయిన్‌గా తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో 2011లో వచ్చిన కెరటం అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఘన విజయం సాధించడంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది ర‌కుల్‌. అక్క‌డి నుంచి శ‌ర‌వేగంగా సినిమాలు చేస్తూ వ‌చ్చారు. ముఖ్యంగా మ‌హేశ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ వంటి అగ్ర హీరోలంద‌రితో న‌టించారు స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను ఎంజాయ్ చేశారు. అలాగే ఆమె ఓ వైపు సినిమాలు, మ‌రో వైపు ఫిట్‌నెస్ రంగంలో రాణిస్తూ బిజీగా కూడా ఉన్నారు ర‌కుల్‌. ఎఫ్ 45 అనే జిమ్ సెంట‌ర్‌ను కూడా ర‌కుల్ నిర్వ‌హిస్తున్నారు. అలాగే వీలునప్పుడల్లా సోష‌ల్ మీడియాలోనూ త‌న ఫిట్‌నెస్ ర‌హ‌స్యాలు, యోగ గురించి చెబుతూ యాక్టివ్‌గా ఉంటున్నారు. తెలుగులో రీసెంట్‌గా ఆమె వైష్ణ‌వ్ తేజ్‌తో న‌టించిన కొండ‌పొలం చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఇప్పుడామె తెలుగులో ఏ సినిమాలు చేయ‌డం లేదు. ఇటీవల ర‌కుల్ ప్రీత్ సింగ్‌, బాలీవుడ్ న‌టుడు, నిర్మాత అయిన జాకీ భ‌గ్నానీని పెళ్లి చేసుకుంటున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా అందరికీ రివీల్ చేశారు. అయితే ర‌కుల్ ప్రీత్, జాకీ భ‌గ్నానీ పెళ్లిపై జ్యోతిష్కుడు వేణుస్వామి పెద‌వి విరిచారు. వీరిద్దరూ పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌ర‌ని, వెళ్లినా విడిపోతారు. ఓ కేసు విష‌యంలో ర‌కుల్ జైలుకు వెళ్లే అవ‌కాశాలున్నాయ‌ని వేణుస్వామి తెలియ చేయ‌డం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30BsadY

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...