Sunday, 19 December 2021

వామ్మో ఐటెం సాంగ్ ట్రోలింగ్స్‌పై సమంత ట్వీట్.. దెబ్బకు సైలెంట్ అయిపోవాల్సిందే !

స‌మంత స్సీడు మామూలుగా లేదు. విడాకుల వ్య‌వ‌హారం త‌ర్వాత స‌మంత దృక్ప‌థం పూర్తిగా మారిపోయింది. త‌న రూట్‌లో తాను వెళ్లాల‌ని అనుకుంటోంది. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా కామెంట్స్ చేసిన నోరు మెద‌ప‌డం లేదు. అంతెందుకు.. నాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత‌పై ఎన్నో ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. ఒకానొక సంద‌ర్భంలో ఆమె కోర్టు మెట్లు ఎక్కినా, త‌ర్వాత తేరుకుకుని కాస్త జాగ్ర‌త్తలు తీసుకుని మీడియాను జాగ్ర‌త్త‌గా హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత నాగ చైత‌న్యతో విడాకుల గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు అదంతా అయిపోయిన వ్య‌వ‌హార‌మ‌ని, తాను దాని గురించి ఇక‌పై మాట్లాడాల‌ని అనుకోవ‌డం లేద‌ని సింపుల్‌గా తేల్చేసింది. స‌మంత‌లో అంత‌లా మార్పు వ‌చ్చింది. అలాగే రీసెంట్ టైమ్స్‌లో స‌మంత పుష్ప ది రైజ్ చిత్రంలో ‘ఊ అంటావా మావ‌..’ అనే ఐటెం సాంగ్‌లో అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఈ సాంగ్‌లోని సింగ‌ర్ ఇంద్రావ‌తి చౌహాన్ హాస్కీ వాయిస్, స‌మంత అందాల కుర్ర‌కారుకి బాగా క‌నెక్ట్ అయ్యాయి. దాంతో సాంగ్‌కు చాలా మంచి స్పందన వ‌చ్చింది. కొంద‌రు అయితే ఈ సాంగ్‌పై, స‌మంత‌పై ట్రోలింగ్స్ కూడా చేయ‌డం స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా కొంత మంది యువ‌కులు ఊ అంటావా అనే సాంగ్‌పై ఓ వీడియో చేసి దాన్ని నెట్టింట పోస్ట్ చేశారు. వీడియో గ‌మ‌నిస్తే అందులో యువ‌కుడు ఎగ్జామ్ ఉంది క‌దరా.. అంటే, అదే భ‌యంగా ఉందిరా ఎగ్జామ్‌లో ఎక్క‌డ ఊ అంటావా మావ‌.. ఉ ఉ అంటావా సాంగ్ రాసేస్తానేమోన‌ని అంటున్నాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అయ్యింది. అది స‌మంత దృష్టికి కూడా వ‌చ్చింది. అయితే స‌మంత దాన్ని చాలా ఈజీగా తీసుకుని రీ ట్వీట్ చేస్తూ లాఫింగ్ ఎమోజీల‌ను పోస్ట్ చేసింది. ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. స‌మంత ఇన్ డైరెక్ట్‌గా ట్రోలింగ్ బాబుల‌కు మీ ప‌ని న‌న్నేం ఇబ్బంది పెట్ట‌ద‌ని చెప్ప‌క‌నే చెప్పేసింది మ‌రి. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఇప్పుడు స‌మంత య‌శోద అనే పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తోంది. అలాగే పిలిప్ జాన్ దర్శకత్వంలో అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ చేస్తుంది. ఇందులో ఆమె ట్రాన్స్‌జెండ‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండం విశేషం. ఇది కాకుండా డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక బాలీవుడ్ ఎంట్రీ కూడా త్వ‌ర‌లోనే ఇచ్చేయనుంద‌ని స‌మాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3H0NFES

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....