Sunday, 26 December 2021

Pushpa Making Video: తెర వెనుక పుష్పరాజ్ కష్టం.. అబ్బుర పరుస్తున్న ఆన్ లొకేషన్ సీన్స్

స్టైలిష్ స్టార్ మాస్ గెటప్ వేస్తే ఆ బీభత్సం ఎలా ఉంటుందనేది ప్రేక్షకులకు నేరుగా చూపించేశారు సుకుమార్. ఆయన దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ రోల్ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు బన్నీ. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ హ్యూజ్ రెస్పాన్స్ వస్తుండటంతో చిత్రయూనిట్ ఆనందంలో మునిగితేలుతోంది. ఈ నేపథ్యంలో మేకింగ్‌ వీడియో రిలీజ్ చేసి తెర వెనుక పుష్పరాజ్ సహా చిత్రబృందం పడిన కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. సోషల్ మీడియా వేదికగా ఆదివారం విడుదల చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పుష్పరాజ్ యాక్షన్ సీన్స్ మొదలుకొని, సాంగ్స్ మేకింగ్, కీలక సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన దృశ్యాలు చూపించారు. అడవిలో వేసిన సెట్స్‌, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్ల సమన్వయం ఇలా అన్ని కోణాలను టచ్ చేస్తూ ఈ వీడియో వదిలారు. పుష్ప సెట్స్‌పై ఉండగా ఈ మూవీ షూటింగ్ చూసేందుకు వచ్చిన దర్శకుడు వి.వి. వినాయక్‌, అల్లు అర్జున్‌ తనయ అర్హలను ఈ వీడియోలో చూపించి బన్నీ అభిమానులను మరింత హూషారెత్తించారు. అల్లు అర్జున్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమాతో ఆయన మాస్ యాంగిల్ బయటపడింది. ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా ఈ మూవీ హవా నడుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంస్థల సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన నటించగా.. అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రెండో భాగాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపారు డైరెక్టర్ సుకుమార్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FzqUY0

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...