లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న గురించి ఎంటైర్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బాహుబలితో తెలుగు సినిమా సత్తానే కాదు, ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటించారు. వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. యూనిట్ అంతా ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. RRR నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచాయే తప్ప తగ్గించలేదు. ఈ సినిమా ట్రైలర్‌లో ఓ సన్నివేశం ఉంది. అందులో వేగంగా వచ్చే బుల్లెట్ బండిని భీమ్ పాత్రధారి అంటే ఓ చేత్తో ఆపేసి పైకెత్తుతాడు. ట్రైలర్ చాలా బావుందని చాలా మంది చెప్పారు. అయితే, కొందరు ఆ సన్నివేశాన్ని ట్రోల్ కూడా చేశారు. ఈ ట్రోలింగ్స్‌పై హీరో ఎన్టీఆర్ స్పందించారు. కేరళలో జరిగిన RRR ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒకరు బైక్ ఎత్తే సన్నివేశంపై ఎన్టీఆర్‌ను ప్రశ్నించారు. ప్రశ్నకు ఎన్టీఆర్ బదులిస్తూ..ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు నేను కూడా డైరెక్టర్ రాజమౌళిని హీరో బుల్లెట్ బండిని పైకి ఎత్తేయడమేంటి? అని ప్రశ్నించాను. ‘మనిషి చాలా ఎక్కువ ఆనందంలో, ఆవేశంలో ఉన్నప్పుడు అసాధ్యం అనుకున్న పనులను కూడా కొన్నింటిని చేసేస్తాడు. అలాంటి ఎమోషనల్ సీన్‌లో భాగంగానే భీమ్ పాత్రధారి బుల్లెట్ బండిని ఒంటి చేత్తే ఆపేస్తాడు’ అని జక్కన్న సమాధానం ఇచ్చారు. RRRలో బండిని చేత్తో ఆపేసే సీన్ ఎందుకు వస్తుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అని ఈ సందర్భంగా అన్నారు ఎన్టీఆర్. 1920 బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. ఇంకా అజయ్ దేవగణ్, ఆలియా భట్, శ్రియాశరన్, సముద్ర ఖని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న సినిమాను విడుదల చేయబోతున్నారు. సినిమా విడుదల గురించి అందరూ ఎదురుచూస్తున్నారు. డివివి ఎంటైర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mINuGb
No comments:
Post a Comment