Sunday, 26 December 2021

అనుష్కతో నవీన్ పోలిశెట్టి.. ఫస్ట్ లుక్‌ రిలీజ్.. జాతి రత్నం డబుల్ ట్రీట్!!

విలక్షణ కథలతో సెలక్టెడ్ సినిమాలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు హైదరాబాదీ కుర్రోడు . లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగుతెరపై కాలుమోపిన ఈ కుర్ర హీరో రీసెంట్‌గా 'జాతి రత్నాలు' సినిమాతో తెగ అట్రాక్ట్ చేశారు. తనదైన నాచురల్ నటనతో ఆకట్టుకొని అన్నివర్గాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఈ మూవీ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా కాస్త గ్యాప్ తీసుకొని మరీ కథల ఎంపిక చేసుకున్నారు నవీన్. ఈ నేపథ్యంలోనే ఒకేసారి రెండు సినిమాలతో బరిలోకి దిగుతున్నారు. నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి ఆయన రెండు కొత్త సినిమాల ప్రకటన రావడం విశేషం. పుట్టిన రోజున ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇచ్చిన నవీన్.. ఓ సినిమాలో అనుష్కతో తెర పంచుకోబోతున్నారు. శెట్టి చేయబోయే తదుపరి సినిమాలో నవీన్ భాగం కాబోతున్నట్లు తెలుపుతూ అధికారిక ప్రకటన చేసింది యూవీ క్రియేషన్స్ బ్యానర్. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆయన అభిమానుల్లో జోష్ నింపారు మేకర్స్. రా రా కృష్ణయ్య దర్శకుడు మహేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారని, ఇందులో అనుష్క శెట్టి నాలుగు పదుల వయసులో ఉన్న మహిళగా కనిపించనుందని సమాచారం. అయితే ఆమె కంటే వయసులో చిన్నవాడైన నవీన్ పోలిశెట్టి ఆమె ప్రేమలో పడటం, ఆ తర్వాత చోటుచేసుకునే పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని ఇన్‌సైడ్ టాక్. ఇకపోతే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫర్చ్యూన్‌ 4సినిమాస్‌ బ్యానర్లపై మరో సినిమాకు కమిటయ్యారు నవీన్ పోలిశెట్టి. అయితే ఆయన బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. నవీన్‌కి సంబంధించి ఈ రెండు అప్‌డేట్స్ చూశాక ఆయన ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలో నవీన్ సందడి మామూలుగా ఉండబోదంటూ కామెంట్స్ చేస్తున్నారు. సో.. చూడాలి మరి ఈ రెండు సినిమాలతో జాతి రత్నం ఎలాంటి హిట్స్ ఖాతాలో వేసుకుంటారనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sBhis8

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...