రాను రాను మల్టీస్టారర్ సినిమాలకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దిగ్గజ దర్శకులు, అగ్ర హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపుతుండటం ప్రేక్షక వర్గాల్లో నూతనోత్సాహం నింపుతోంది. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ , మెగా పవర్ స్టార్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం . గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ ఎట్టకేలకు ఈ సంక్రాంతి కానుకగా జనవరి 7న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ విషయంలో తనదైన స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు జక్కన్న. పలు భాషల్లో ఈ ప్యాన్ ఇండియా సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో అన్ని భాషా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పేలా ప్రమోషన్స్ చేపడుతున్నారు. ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రెస్ మీట్స్ నిర్వహిస్తూ RRR విశేషాలతో హైప్ పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. RRR సినిమా రిలీజ్ తర్వాత మరిన్ని బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రాలు వచ్చే అవకాశాలున్నాయా అనే విషయమై ఎన్టీఆర్ ఆసక్తికరంగా స్పందించారు. ఈ విషయం ఇప్పుడు చెప్పొచ్చొ లేదో తెలియదు కానీ మా రెండు కుటుంబాల మధ్య 35 సంవత్సరాలుగా పోరు నడుస్తోందని అన్నారు. అయినా తామిద్దరం (రామ్ చరణ్- ఎన్టీఆర్) మంచి స్నేహితులని తెలిపారు. తమ మధ్య పోరు ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటుందని చెప్పిన యంగ్ టైగర్.. RRR తర్వాత దేశంలోని గొప్ప నటీనటులంతా ఒకే తాటి పైకి వస్తారని, భారీ మల్టీస్టారర్ సినిమాలు వస్తాయనే నమ్మకం ఉందని అన్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, మన్యం వీరుడుగా రామ్ చరణ్ నటించారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ భాగమయ్యారు. సముద్ర ఖని, శ్రియా శరన్ కీలక పాత్రలు పోషించారు. హాలీవుడ్ నుంచి ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. RRR మూవీ కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qst7Oz
No comments:
Post a Comment