నెట్టింట్లో ఎప్పుడూ ఏదో టాపిక్‌తో ట్రెండింగ్‌లోనే ఉంటూనే వస్తాడు. మొన్నటి వరకు మా ఎన్నికల వ్వవహారంతో దుమ్ములేపేశాడు. గెలుస్తా.. వంద ఇళ్లు కట్టిస్తా.. జీవిత రాజశేఖర్ మీద కచ్చితంగా గెలుస్తాను అంటూ మీడియాలో దంచికొట్టేశాడు. ఇక నామినేషన్ వేసిన సమయంలోనూ దుమ్ములేపేశాడు. కానీ చివరకు తుస్సుమన్నాడు. తన దైవసమానులు చెప్పడంతో వెనక్కి తగ్గుతున్నట్టు ప్రకటించాడు. నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాడు.. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు బండ్ల గణేష్ ప్రకటించాడు. అయితే బండ్ల గణేష్ ఇప్పుడు తన సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. హీరోగా, ప్రధాన పాత్రలో బండ్ల గణేష్ కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. తమిళంలో వచ్చిన ఒత్తు సెరుప్పు సైజ్ 7 అంటూ వచ్చిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. అలాంటి సినిమాను మన తెలుగులో బండ్లన్నతో రీమేక్ చేస్తున్నారు. దానికి అంటూ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇది వరకే డేగల బాబ్జీకి సంబంధించిన పోస్టర్లు బయటకు వచ్చాయి. అందులో బండ్ల గణేష్ తన ఉక్రోషాన్ని, ఆవేశాన్ని చూపించాడు. అయితే తాజాగా మరో స్టిల్‌ను షేర్ చేశాడు. అందులోనూ బండ్ల గణేష్ అదరగొట్టేశాడు. షూటింగ్ ఫుల్ స్వింగ్‌లోఉందని, త్వరలోనే పూర్తి కానుందని చెప్పేశాడు. ఇది పక్కా విభిన్న చిత్రమే అవుతుందని నమ్మకంగా చెప్పేశాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటుల సంగతి ఇంత వరకు ప్రకటించలేదు. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్లు రానున్నట్టు తెలుస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FbiMNT
No comments:
Post a Comment