టాలీవుడ్‌లో పెద్ద దిక్కుగా ఒకప్పుడు దాసరి నారాయణరావు ఉండేవారు. గురువు గారు అంటూ ఇండస్ట్రీలోని టాప్ హీరోలు కూడా గౌరవాన్ని ఇచ్చేవారు. అయితే దాసరి మరణానంతరం ఆ స్థానం, ఆ పెద్దరికానికి లోటు ఏర్పడింది. అయితే మాత్రం పెద్దన్న స్థానాన్ని భర్తి చేసేందుకు ముందుకు వచ్చాడు. దాదాపు ఇండస్ట్రీ మొత్తం కూడా చిరుకు ఆ స్థానాన్ని కట్టబెట్టేందుకు సుముఖంగానే ఉంది. ఇక చిరు సైతం ఎన్నో కార్యక్రమాలను ముందుండి నడిపించాడు. అలా చిరును పెద్దన్నగా దాసరి తరువాత స్థానానికి సరైన వాడని అందరూ అనుకున్నారు. అంగీకరించారు. కానీ తాజాగా చేసిన కామెంట్లు చూస్తుంటే చిరును పెద్దన్నగా చేయడం ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పాల్గొన్న మోహన్ బాబు కొన్ని కామెంట్లు చేశాడు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో పెద్దలెవరూ లేరని, గురువు గారు దాసరి నారాయణరావుతోనే ఆ పెద్దరికం పోయిందని మోహన్ బాబు అన్నాడు. ఇప్పుడు ఎవరైనా తాము సినీ పెద్దలుగా భావిస్తున్నారేమో తనకు తెలీదని, దాని గురించి తాను మాట్లాడనను అని తప్పించుకున్నాడు. అంటే చిరంజీవి పెద్దరికాన్ని మోహన్ బాబు లెక్కచేయడం లేదని అర్థమవుతోంది. ఏది ఏమైనా చిరంజీవి మోహన్ బాబు బంధం చిత్రవిచిత్రంగా ఉంటుంది. ఇక అదే ఇంటర్వ్యూలో మోహన్ బాబు మా ఎన్నికల గురించి కూడా మాట్లాడాడు. మెగా, అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరైనా పోటీకి నిలబడి ఉంటే.. విష్ణుకు నో చెప్పేవాడిని అని అన్నాడు. ఎందుకు వారు కూడా తన బిడ్డల్లాంటి వారేనని తెలిపాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3uGGLPV
No comments:
Post a Comment