Sunday, 16 August 2020

Pawan Kalyan: రికార్డులు చిత్తడి చిత్తడి.. మహేష్ బాబు ఫీట్ దాటేసి ఛలోరే ఛలోరే చల్.. పవన్ ఫ్యాన్సా మజాకా!

తమ అభిమాన హీరో బర్త్ డే వస్తోందంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బర్త్ డే సీడీపీ (కామన్ డిస్ప్లే పిక్)లు, హ్యాష్ ట్యాగ్స్‌తో ఆన్‌లైన్ వేదికలు హోరెత్తిపోవాల్సిందే. ఈ మధ్యకాలంలో ఇదే విషయమై స్టార్ హీరోల అభిమానుల నడుమ పోటీ వాతావరణం నెలకొంది. ఎవరికి వారు తమ తమ హీరో బర్త్ డేని ట్రెండ్ చేయడంలో సరికొత్తగా ఆలోచిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఫ్యాన్స్ కొత్త రికార్డు నెలకొల్పగా, తాజాగా పవర్ స్టార్ ఫ్యాన్స్ దాన్ని చెరిపేసి ఆ స్థానంలో పేరును లిఖించుకున్నారు. Also Read: సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రాబోతోంది. ఈ సందర్భంగా హ్యాష్ ట్యాగ్‌తో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా హంగామా షురూ చేశారు. ఆన్‌లైన్ వేదికలు షేక్ అయ్యేలా PawanKalyanBirthdayCDPని తెగ వైరల్ చేసేశారు. దీంతో ఈ పిక్, హ్యాష్ ట్యాగ్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ ఎంతో చాలెంజింగ్‌గా తీసుకొని నిన్న సాయంత్రం 6 గంటలకు మొదలెట్టి.. నేటి సాయంత్రం 6 గంటలకు వరకు దుమ్ముదులిపేశారు. దీంతో మహేష్ పేరిట ఉన్న రికార్డు కాస్త పవన్ పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ అయింది. రీసెంట్‌గా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ హ్యాండిల్స్‌పై ఓ ట్రెండ్ సెట్ చేశారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. #HappyBirthdyaMaheshBabu అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ చేస్తూ 60.2 మిలియన్ల ట్వీట్లతో వరల్డ్ రికార్డు నెలకొల్పారు. దీంతో ఆ రికార్డులు సవాల్‌గా స్వీకరించి రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ PawanKalyanBirthdayCDP హ్యాష్ ట్యాగ్‌తో 24 గంటల్లోనే 65 మిలియన్ల ట్వీట్స్ చేసి సరికొత్త వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. ఛలోరే ఛలోరే చల్ అంటూ గత రికార్డులకు చిత్తడి చిత్తడి చేసేశారు. ఈ పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది పవన్ బర్త్ డే హంగామా ఏ రేంజ్‌లో ఉండనుందో అర్ధం చేసుకోవచ్చు. ఇకపోతే 'అజ్ఞాతవాసి' మూవీ తర్వాత సినిమాలు వదిలేసి.. రెండేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన పవన్ కళ్యాణ్, నిర్మాతల కోరిక మేరకు ఇటీవలే తిరిగి కెమెరా ముందుకొచ్చారు. వేణు శ్రీరామ్ దర్శత్వంలో రూపొందుతున్న వకీల్ సాబ్ మూవీ చేస్తున్న ఆయన ఆ తర్వాత క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30YWsF2

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....