Sunday, 16 August 2020

అల్లు శిరీష్ ‘గో లోక‌ల్ బీ వోక‌ల్’ మూమెంట్‌కి విశేష స్పందన

యంగ్ హీరో చేపట్టిన ‘గో లోక‌ల్ బీ వోక‌ల్’ ఉద్యమానికి నాంది పలికిన విషయం తెలిసిందే. ‘గో లోకల్ బీ వోకల్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో శిరీష్ మొద‌లుపెట్టిన ఈ ఉద్యమం ఆన్‌లైన్‌లో విశేషంగా ట్రెండ్ అవుతుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సూచన మేరకు ప్రతి భారతీయుడు కుదిరినంత వరకు విదేశి బ్రాండ్ల వాడకాన్ని తగ్గించాలని, ప్రత్యామ్నాయం లేకపోతేనే స్వదేశీయేతర ఉత్పత్తులను వాడాలని, అంతేగాని ప్రతి అవ‌స‌రానికి విదేశీ ఉత్పత్తలు వాడకూడదని శిరీష్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితం తానే స్వయంగా మార్కెట్‌కి వెళ్లి ఏరికోరి భారతీయ బ్రాండ్లను వెతికి మ‌రీ కొన్నారు. వీలైనంత వరకు అందరూ ఇలాగే చేయండి అంటూ తాను కొన్న భారతీయ ఉత్పత్తుల ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. చాలా మంది స్వదేశీ వస్తువుల‌ను ఉప‌యోగిస్తున్నా స‌రే బ‌య‌ట‌కి చెప్పరు, ఇకపై అలా కాకుండా మ‌నం స్వదేశీ ఉత్పత్తుల‌ను వాడుతున్నాం అని స‌గ‌ర‌వ్వంగా బ‌య‌ట‌కి వెల్లడించాల‌ని శిరీష్ కోరారు. Also Read: ఈ సోషల్ మూమెంట్‌ను తరువాత దశలో భాగంగా అల్లు శిరీష్ తన సన్నిహితులకు, కొందరు ఫిల్మ్, స్పోర్ట్స్ సెలెబ్రెటీలకు దేశీయ ఉత్పత్తులుతో కూడిన గిఫ్ట్ హంపర్స్ పంపించి, వారిని కూడా ఈ ‘గో లోకల్ బీ వోకల్’ ఉద్యమంలో పాల్గొని దీన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిందిగా కోరారు. శిరీష్ ఛాలెంజ్ విసిరిన సినీ తారల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్, రకుల్ ప్రీత్, అను ఇమ్మానుయేల్, రాశి ఖన్నా, అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఉన్నారు. వీరితో పాటు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కూడా ఉండటం విశేషం. ఈ సెలెబ్రెటీస్ అంతా గిఫ్ట్ హంపర్ అందుకోవడమే కాకుండా ఇలాంటి అద్భుతమైన మూమెంట్‌కి నాంది పలికిన అల్లు శిరీష్‌కు తమ సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. అల్లు శిరీష్ ‘గో లోకల్ బీ వోకల్’ మూమెంట్‌లో తారలకు పంపిన గిఫ్ట్ హంపర్‌లో ఉన్న దేశీయ ఉత్పత్తుల జాబితా ఇలా ఉంది.. పల్ప్ ఇండియా (పక్క హైదరాబాద్ తయారీ) ఉస్తారా - కొలోన్ బొంబాయి షేవింగ్ కంపెనీ ఫేస్ వాష్ అండ్ మాస్క్ గ్రీన్ స్నాక్ కో - క్వినోవా పఫ్స్ అండ్ స్నాక్స్ కవర్ ఇట్ అప్: సెల్ ఫోన్ కవర్లు ఆర్గానిక్ ఇండియా: ఆయుష్ క్వాత్, గ్రీన్ టీ, మగ్స్, బాడీ ఆయిల్ ఇదిలా ఉండగా శిరీష్ ప్రస్తుతం త‌న త‌దుప‌రి సినిమాకి సంబంధించిన ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రక‌ట‌నతో పాటు కీల‌క విష‌యాలు అతిత్వర‌లో ప్రకటించబోతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PYh3TK

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....