Sunday, 16 August 2020

ఓ ఇంటివాడవుతోన్న ‘సిరివెన్నెల’ కుమారుడు.. నిరాడంబరంగా నటుడి నిశ్చితార్థం

కక్కొచ్చినా కళ్యాణమొచ్చినా ఆగదంటారు పెద్దలు. అందుకే, కరోనా వైరస్ విజృంభిస్తోన్నా.. లాక్‌డౌన్ అమలులో ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు మాత్ర ఆగలేదు. తెలుగు సినీ పరిశ్రమలో సైతం ఈ లాక్‌డౌన్ సమయంలో చాలా పెళ్లిళ్లు జరిగాయి. దిల్ రాజుతో టాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లు మొదలయ్యాయి. దిల్ రాజు రెండో వివాహం చేసుకుని త‌న జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆ త‌ర్వాత నిఖిల్‌, జ‌బ‌ర్దస్త్ క‌మెడియ‌న్ - న‌టుడు మ‌హేష్, హీరో నితిన్, రానా దగ్గుబాటి వివాహలు జరిగాయి. Also Read: మూడు రోజుల క్రితం మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌ నిశ్చితార్థం చైతన్య జొన్నలగడ్డతో జరిగింది. కాగా, ఇప్పుడు మరో నటుడు ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆగస్టు 15న ఆయన నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ నటుడు ఎవరో కాదు ‘ఫిదా’ ఫేమ్ . ఈయన ప్రముఖ సినీ గేయ రచయిత పెద్ద కుమారుడు. తనకు నిశ్చితార్థం జరిగినట్టు రాజా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘‘2020లో ది బెస్ట్ పార్ట్ ఇది. నా కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మీ అందరి ప్రేమ, ప్రోత్సాహానికి కృత‌జ్ఞత‌లు’’ అని తన పోస్ట్‌లో రాజా పేర్కొన్నారు. అంతేకాదు, ఎంగేజ్‌డ్ అని హ్యాష్‌ట్యాగ్ పెట్టారు. రింగ్ ఎమోజీ కూడా చేర్చారు. అయితే, తనకు కాబోయే భార్య పేరు, వివరాలను మాత్రం రాజా వెల్లడించలేదు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి ఇద్దరు కుమారుల సంతానం. పెద్ద కుమారుడు రాజా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రెండో కుమారుడు యోగేశ్వర్ శర్మ సంగీత దర్శకుడిగా ప్రయత్నిస్తున్నారు. రాజా ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. ‘ఎవడు’, ‘ఫిదా’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘అంతరిక్షం’, ‘మిస్టర్ మజ్ను’, ‘రణరంగం’, ‘చాణక్య’, ‘ఇద్దరి లోకం ఒకటే’ వంటి సినిమాల్లో రాజా నటించారు. తాజాగా ఆయన ‘భానుమతి & రామకృష్ణ’ సినిమాలో కనిపించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3asUkbE

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....